పంజాబ్ టైటిల్ కొట్టేనా..?
ఈ వార్తాకథనం ఏంటి
IPL 2023 ముందు PBKS అటగాళ్ల విషయంలో కీలక మార్పులు చేసింది. అయినా 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ అశించన స్థాయిలో రాణించలేదు.
పాయింట్ల పట్టిక పట్టికలో ఆరవ స్థానంలో నిలిచింది. జానీ బెయిర్‌స్టో, కగిసో రబాడ, అర్ష్‌దీప్ ఫామ్‌లో లేకపోవడంతో టీం ఇబ్బంది పడుతోంది.
ఆ టీంలో మరో ముగ్గురు ప్లేయర్లు రాణిస్తే, కప్ సాధిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రాహుల్ చాహర్ ప్రధాన స్పిన్నర్‌గా 13 మ్యాచ్‌లలో 7.71 ఎకానమీ రేటుతో 14 వికెట్లు తీశాడు. అనుకున్న స్థాయిలో బౌలింగ్ చేయలేదు. ప్రస్తుతం భారతదేశం ఏ కి ప్రాతినిధ్యం వహించాడు. గతంలో ముంబై జట్టులో రాహుల్ చాహర్ కీలకపాత్ర పోషించాడు. అయితే ఈసారి IPL 2023లో చాహర్ పాత్ర కీలకంగా ఉండనుంది.
ఐపీఎల్
ప్రభుసిమ్రాన్ సింగ్, జితేష్ శర్మపై ఆశలు
ప్రభుసిమ్రాన్ సింగ్ ఇప్పటివరకూ ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. ఇటీవల 2022-23 రంజీ ట్రోఫీ రౌండ్ 1లో అద్భుతమైన డబుల్ సెంచరీని కొట్టాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఓపెనర్ గా రాణించే సత్తా కూడా ఉంది.
జానీ బెయిర్‌స్టో గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. దాంతో ప్రభాస్‌సిమ్రాన్ అవకాశం కల్పిస్తే మెరుగ్గా రాణిస్తాడని పలువురు అభిప్రాయపడుతున్నారు.
జితేష్ శర్మ ప్రస్తుతం దేశీయ క్రికెట్‌లో అత్యుత్తమ ఫినిషర్‌లలో ఒకరిగా పేరు సంపాదించుకుంటున్నాడు. టీ20లో అతడికి మెరుగైన రికార్డు ఉంది.
జితేష్ IPL 2022లో PBKS తరపున 12 మ్యాచ్‌లు ఆడాడు, 163.64 స్ట్రైక్ రేట్‌తో 234 పరుగులు చేశాడు. భవిష్యతులో టీమిండియాలో చోటు దక్కే అవకాశం ఉంది.