
IND vs PAK Final: 41 ఏళ్ల తరువాత తొలిసారి ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్-పాక్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం 17వ ఎడిషన్ ఆసియా కప్ జరగుతోంది.ఈ సారి మొత్తం ఎనిమిది జట్లు బరిలోకి దిగాయి. ఫైనల్‌లో భారత్,పాకిస్థాన్ తలపడతుండటం ప్రత్యేకం. టాప్ టీమ్‌లు కాబట్టి ఇందులో పెద్ద వింతేముంది? అని అనుకోవచ్చు. కానీ నిజానికి ఇదే ఈ టోర్నీకి పెద్ద ట్విస్ట్ . భారత్ - పాక్ తొలిసారి ఆసియా కప్ ఫైనల్‌లో తలపడనుండటం గమనార్హం. అంతేకాదు, ఒకే ఎడిషన్‌లో భారత్ పాకిస్థాన్‌ను మూడుసార్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి. ఈ 2025 ఎడిషన్ ఆసియా కప్ చరిత్రలో ప్రత్యేకతగా నిలుస్తోంది.
వివరాలు
టీమ్‌ఇండియా 8సార్లు ఆసియా కప్ విజేత
41 సంవత్సరాల క్రితం, 1984లో ఆసియా కప్ ప్రారంభమైంది. ఆ సమయానికి మూడు జట్లు పాల్గొన్న ఈ టోర్నీ ఇప్పుడు ఎనిమిది టీములకు చేరింది అయితే, ఎక్కువగా టీమ్‌ఇండియా (8) ఛాంపియన్‌గా నిలవగా.. శ్రీలంక (6) తర్వాత స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ ఇప్పటివరకూ ఈ టైటిల్ గెలవలేకపోయింది. పాకిస్థాన్ రెండు సార్లు ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ ఫైనల్ ఇదే మొదటి సరి. ఇప్పటివరకు భారత్ 10 సార్లు ఫైనల్ చేరి ఎనిమిది సార్లు విజేతగా నిలిచింది. కానీ ఒక్కసారి కూడా పాక్ మనకు టైటిల్ పోరులో ఎదురుకాలేదు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది.
వివరాలు
హ్యాట్రిక్ అవకాశం
ఒకే ఎడిషన్‌లో పాకిస్థాన్‌తో భారత్ మూడు మ్యాచులు ఆడలేదు. గరిష్టంగా రెండు సార్లు మాత్రమే పోటీపడ్డాయి. కానీ ఈసారి మూడోసారి ఎదుర్కోవడానికి పరిస్థితులు ఏర్పడ్డాయి. గత రెండు మ్యాచ్‌ల్లో భారత్ పాకిస్థాన్‌ను ఓడించింది. పహల్గాం ఘటన తర్వాత కేంద్రం పాకిస్థాన్‌తో సంబంధాల విషయంలో గట్టి ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ ఐసీసీ, ఏసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్‌లను ఆడేందుకు భారత్ సమ్మతించింది. ఈసారి గ్రూప్ స్టేజ్‌లో 'కరచాలనం' వివాదం, సూపర్-4లో హారిస్ రవూఫ్, ఫర్హాన్ వెకిలి చర్యలు ప్రధాన చర్చాంశాలు. ఫైనల్‌లో కూడా పాక్‌ను ఓడించి భారత్ హ్యాట్రిక్ సాధించాలని అభిమానుల ఆకాంక్ష. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 28న ఆదివారం, దుబాయ్‌లో జరుగనుంది.