5 days for IPL: మరో 5 రోజులు.. 84 మ్యాచ్‌లతో సీజన్.. 5 కీలక విషయాలివే
ఈ వార్తాకథనం ఏంటి
అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ సీజన్ మరో 5 రోజుల్లో ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2026 సీజన్ 84 మ్యాచ్‌లతో జరుగుతుందని నిర్ధారించారు. ఇది గత ఏడాదికి (74 మ్యాచ్‌లు) కంటే 10 ఎక్కువ. 80 మ్యాచ్‌లు లీగ్ స్టేజ్‌లో, మిగిలిన 4 మ్యాచ్‌లు ప్లేఅఫ్స్‌లో జరుగుతాయి. వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కారణంగా, బీసీసీఐ ఇప్పటివరకు మొదటి 20 రోజుల షెడ్యూల్‌ను మాత్రమే విడుదల చేసింది. త్వరలోనే పూర్తి షెడ్యూల్ రిలీజ్ చేయనుంది.
వివరాలు
ఎల్లో జెర్సీలో.. సంజూ శాంసన్
రాజస్థాన్ రాయల్స్‌కు పదేళ్లుగా సేవలందించాడు సంజూ శాంసన్. ఇక ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ ధరించబోతున్నాడు. రాయల్స్ తరఫున 4,000కి పైగా పరుగులు సాధించిన శాంసన్ ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో సీఎస్కే కోసం ఆడనున్నాడు. టీ20 వరల్డ్ కప్‌లో మంచి ప్రదర్శన చూపిన సంజూ శాంసన్..చెన్నై తరపున కూడా మంచి ఇన్నింగ్స్ ఆడుతాడని అందరూ భావిస్తున్నారు.
వివరాలు
జడేజా తిరిగి రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి..
శాంసన్ CSKకు వెళ్ళిన డీల్‌లో, సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తిరిగి రాజస్థాన్ రాజల్స్‌లో చేరాడు. జడేజా 2008, 2009లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడారు. మొదటి సీజన్ టైటిల్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించారు జడేజా. 2012 సీజన్ ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరిన ఆయన 12 సీజన్లుగా జట్టు కోసం ఆడారు. ఇప్పుడు ఆయన తిరిగి రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేరి అందర్నీ మెప్పించబోతున్నాడు.
వివరాలు
సీఎస్కే వ్యూహం ఫలిస్తుందా?
చెన్నై సూపర్ కింగ్స్ 2026 ఐపీఎల్ ఆక్షన్‌లో అన్‌క్యాప్డ్ ప్లేయర్లైన కార్తిక్ శర్మ (Kartik Sharma), ప్రశాంత్ వీర్ (Prashant Veer)ను ఒక్కోక్కరికీ రూ.14.2 కోట్లు ఖర్చు చేశారు. 21 ఏళ్ళ ఈ ఆటగాళ్లు ఇంతకు ముందు ఐపీఎల్‌లో ఆడలేదు. వీర్ ఎడమ చేతి స్పిన్-బోలింగ్ ఆల్‌రౌండర్, కార్తిక్ డ్యాషింగ్ వికెట్‌కీపర్-బాటర్ కావడం విశేషం. ఇప్పుడు వారిద్దరి ప్రదర్శన చెన్నై సూపర్ కింగ్స్ కు మరింత ప్లస్ కానుంది.
వివరాలు
ధోనీకి ఇది చివరి సీజనా?
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ MS ధోనీ, జూలై 2019లో చివరిసారిగా టీమ్ ఇండియా తరపున ఆడారు. అంతర్జాతీయ రిటైర్మెంట్ తర్వాత ఏడో ఐపీఎల్ సీజన్‌లో పాల్గొంటున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఆయన మరింత దూకుడుగా ఆడి చాాలా రోజులైంది. 44 ఏళ్ళ వయసు దాటిన ధోనీ, ఈ సీజన్ ఆయనకు చివరిది కావచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, ధోనీ రిటైర్మెంట్ అంశం గత కొన్ని ఐపీఎల్ ఎడిషన్ల నుండి మళ్లీ మళ్లీ చర్చకు వస్తూనే ఉంది. మరి ఈ సీజన్ లో అయినా ఆ విషయంపై క్లారిటీ వస్తోందో లేదో చూడాలి.