IPL 2026: మరో 8 రోజులు.. ఐపీఎల్ కొత్త స్టార్స్ రెడీ.. ఈ 8 మంది ఆటగాళ్లే ఇప్పుడు హాట్ టాపిక్
ఈ వార్తాకథనం ఏంటి
అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026కు కౌంట్‌డౌన్ మొదలైంది. మరో 8 రోజుల్లోనే టోర్నీ ప్రారంభం కానుంది. ఇక అందరూ ఐపీఎల్ చూస్తూ.. టీవీలకు, ఫోన్లకు అతుక్కుపోవాల్సిందే. మరి ఈసారి ఐపీఎల్‌లో యువ ఆటగాళ్లపైనే అందరి దృష్టి నిలిచింది. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త టాలెంట్‌ను వెలికితీసే వేదికగా మారనుంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌లో రాణించే అవకాశం ఉన్న 8 మంది యువ ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం.
వివరాలు
వైభవ్ సూర్యవంశీ (రాజస్థాన్ రాయల్స్)
15 ఏళ్ల వయసుకే వైభవ్ సూర్యవంశీ చాలా మందికి ఫేమరెట్ క్రికెట్ ప్లేయర్ అయిపోయాడు. వైభవ్ సూర్యవంశీపై భారీ అంచనాలు ఉన్నాయి. 2026 అండర్-19 ప్రపంచకప్ విజేతగా నిలిచిన ఈ యువ ఆటగాడు, 2025లో రాజస్థాన్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. 7 మ్యాచ్‌ల్లో 252 పరుగులు చేసి ఒక శతకం, ఒక అర్ధశతకం నమోదు చేశాడు. మొత్తంగా టీ20ల్లో 701 పరుగులు సాధించాడు.
వివరాలు
అయుష్ మత్రే (చెన్నై సూపర్ కింగ్స్)
18 ఏళ్ల అయుష్ మత్రేను చెన్నై సూపర్ కింగ్స్ 2025లో అరంగేట్రం చేయించింది. 7 మ్యాచ్‌ల్లో 240 పరుగులు చేసి మంచి ప్రదర్శన కనబర్చాడు. 2026 అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ యువ ఆటగాడు. ఇక టీ20ల్లో 565 పరుగులు సాధించి తన ప్రతిభను నిరూపించాడు. ఇక ఈ ఐపీఎల్‌లో మరిన్ని అయుష్ మత్రే మరిన్ని రికార్డు సాధిస్తాడని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.
వివరాలు
అంగ్క్రిష్ రఘువంశీ (కోల్ కతా నైట్ రైడర్స్)
ఈ ఐపీఎల్ సీజన్‌లో అద్భుతంగా ఆడతాడని అనుకుంటున్న మరో యంగ్ ప్లేయర్ రఘువంశీ. ముంబైకు చెందిన అంగ్క్రిష్ రఘువంశీ ఇప్పటికే దేశీయ క్రికెట్‌లో మంచి గుర్తింపు పొందాడు. 2024లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఈ ఆటగాడు. ఇప్పటికీ 22 మ్యాచ్‌ల్లో 463 పరుగులు చేసి రెండు అర్ధశతకాలు సాధించాడు. జట్టు విజయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నాడు.
వివరాలు
సమీర్ రిజ్వీ (ఢిల్లీ క్యాపిటల్స్)
22 ఏళ్ల సమీర్ రిజ్వీ 2026లో ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. 2025లో 5 మ్యాచ్‌ల్లో 121 పరుగులు చేసి ఒక అర్ధశతకం సాధించాడు. సమీర్ రిజ్వీ స్ట్రైక్ రేట్ 153.16గా ఉంది. కెప్టెన్‌గా ఈసారి జట్టుకు విజయాన్ని తీసుకొచ్చేందుకు సమీర్ సిద్ధమయ్యాడు.
వివరాలు
తేజస్వి సింగ్ దహియా (కోల్ కతా నైట్ రైడర్స్)
వికెట్‌కీపర్, బ్యాటర్‌గా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు తేజస్వి సింగ్ దహియా. ఈ యంగ్ ప్లేయర్‌ను కోల్ కతా జట్టు రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పటివరకు 6 టీ20 మ్యాచ్‌ల్లో 113 పరుగులు చేశాడు. దహియా స్ట్రైక్ రేట్ 168.65గా ఉంది. వికెట్ కీపర్‌గా మంచి ప్రదర్శన చూపుతూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
వివరాలు
అశోక్ శర్మ (గుజరాత్ టైటాన్స్)
రాజస్థాన్‌కు చెందిన 23 ఏళ్ల పేసర్ అశోక్ శర్మను గుజరాత్ జట్టు రూ.90 లక్షలకు తీసుకుంది. 2025 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో 10 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. మరి ఈ ఐపీఎల్‌లో ఈ యువ ఆటగాడు మరిన్ని రికార్డులు సాధించే అవకాశం ఉంది.
వివరాలు
కార్తిక్ శర్మ (చెన్నై సూపర్ కింగ్స్)
19 ఏళ్ల కార్తిక్ శర్మను చెన్నై జట్టు రూ.14.2 కోట్లకు కొనుగోలు చేసింది. 2025 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో 5 మ్యాచ్‌ల్లో 133 పరుగులు చేసి ఈ ఆటగాడు అందర్నీ మెప్పించాడు. ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో మరిన్ని రికార్డులు నెలకొల్పుతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ధోనీ నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటూ కార్తిక్ శర్మ ముందుకు సాగనున్నాడు.
వివరాలు
ప్రశాంత్ వీర్ (చెన్నై సూపర్ కింగ్స్)
20 ఏళ్ల ప్రశాంత్ వీర్‌ను కూడా చెన్నై జట్టు రూ.14.2 కోట్లకు తీసుకుంది. ఇప్పటివరకు 9 టీ20 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీశాడు. అలాగే ఇప్పటి వరకూ 112 పరుగులు చేశాడు. ప్రశాంత్ వీర్ స్ట్రైక్ రేట్ 167.16గా ఉంది. ఈసారి ఐపీఎల్‌లో జట్టు విజయంలో కీలకంగా మారే అవకాశం ఉంది.