LOADING...
IPL: ఐపీఎల్‌కు 9 రోజులే..ఈ 9 యంగ్ ప్లేయర్స్‌పైనే భారీ అంచనాలు
ఐపీఎల్‌కు 9 రోజులే..ఈ 9 యంగ్ ప్లేయర్స్‌పైనే భారీ అంచనాలు

IPL: ఐపీఎల్‌కు 9 రోజులే..ఈ 9 యంగ్ ప్లేయర్స్‌పైనే భారీ అంచనాలు

వ్రాసిన వారు Moogati Shabari
Mar 18, 2026
02:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 ప్రారంభానికి కేవలం 9 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. మార్చి 28 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీ ఎప్పటిలాగే కొత్త ప్రతిభకు వేదికగా నిలవనుంది. ఈసారి జట్లు కొత్త ఆటగాళ్లను తీసుకుని మరింత బలంగా బరిలోకి దిగనున్నాయి. ఈ సీజన్‌లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగనున్న 9 మంది కొత్త ఆటగాళ్లు వీరే.

వివరాలు

వైభవ్ సూర్యవంశీ (రాజస్థాన్ రాయల్స్)

యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ జట్టు భవిష్యత్ స్టార్‌గా భావిస్తోంది. దేశీయ క్రికెట్‌లో తన దూకుడైన బ్యాటింగ్‌తో ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న ఈ ఆటగాడు.. పెద్ద షాట్లు ఆడుతూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ జట్టు సుమారు రూ.1.10 కోట్లుకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ లాంటి వేదికపై అతను తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఇది. ఈ సీజన్‌లో రాజస్థాన్ జట్టుకు కీలకంగా మారే అవకాశమున్న ఆటగాళ్లలో వైభవ్ సూర్యవంశీ కూడా ఒకరుగా ఉంటారని అందరూ భావిస్తున్నారు.

వివరాలు

మంగేష్ యాదవ్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)

మధ్యప్రదేశ్‌కు చెందిన ఎడమచేతి పేసర్ మంగేష్ యాదవ్‌ను ఆర్‌సీబీ రూ.5.2 కోట్లకు కొనుగోలు చేసింది. 23 ఏళ్ల ఈ బౌలర్ తన యార్కర్లతో ప్రసిద్ధి పొందాడు. గత ఏడాది ఎంపీ టీ20 లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

Advertisement

వివరాలు

కూపర్ కానోలీ (పంజాబ్ కింగ్స్)

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కూపర్ కానోలీని పంజాబ్ కింగ్స్ రూ.3 కోట్లకు తీసుకుంది. 22 ఏళ్ల ఈ ఆటగాడు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ రాణించే సామర్థ్యం కలిగి ఉన్నాడు.

Advertisement

వివరాలు

తేజస్వి సింగ్ దహియా (కోల్ కతా నైట్ రైడర్స్)

వికెట్‌కీపర్ బ్యాటర్ తేజస్వి సింగ్ దహియాను కేకేఆర్ రూ.3 కోట్లకు తీసుకుంది. తక్కువ మ్యాచ్‌ల్లోనే మంచి స్ట్రైక్ రేట్‌తో ఆకట్టుకున్నాడు.

వివరాలు

పతుమ్ నిస్సాంక (ఢిల్లీ క్యాపిటల్స్)

శ్రీలంక ఓపెనర్ పతుమ్ నిస్సాంకను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.4 కోట్లకు సొంతం చేసుకుంది. గత ఏడాది టీ20ల్లో అద్భుత ప్రదర్శన చేశాడు.

వివరాలు

ఔకిబ్ నబీ (ఢిల్లీ క్యాపిటల్స్)

జమ్మూ కాశ్మీర్ పేసర్ ఔకిబ్ నబీని ఢిల్లీ క్యాపిటల్స్ రూ.8.40 కోట్లకు కొనుగోలు చేసింది. దేశీయ క్రికెట్‌లో అతని ప్రదర్శన అద్భుతంగా ఉంది.

వివరాలు

అశోక్ శర్మ (గుజరాత్ టైటాన్స్)

రాజస్థాన్‌కు చెందిన అశోక్ శర్మను గుజరాత్ టైటాన్స్ రూ.90 లక్షలకు తీసుకుంది. వేగంగా బౌలింగ్ చేయడం అతని ప్రత్యేకత.

వివరాలు

ఫిన్ అలెన్ (కోల్ కతా నైట్ రైడర్స్)

న్యూజిలాండ్ ఆటగాడు ఫిన్ అలెన్‌ను కేకేఆర్ రూ.2 కోట్లకు తీసుకుంది. ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో అద్భుతంగా ఆడాడు.

వివరాలు

జాక్ ఎడ్వర్డ్స్ (సన్‌రైజర్స్ హైదరాబాద్)

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్‌ను ఎస్‌ఆర్‌హెచ్ రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో మంచి ప్రదర్శన చూపుతున్నాడు. మరి ఈ కొత్త ఆటగాళ్లు ఐపీఎల్ 2026లో ఎలా రాణిస్తారో చూడాలి. అభిమానులు మాత్రం వీరి ప్రదర్శన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement