Loading...
IND vs NZ: భారత్‌తో వన్డే సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు బిగ్‌ షాక్‌.. ఇద్దరు కీలక ఆటగాళ్లు ఔట్‌!
భారత్‌తో వన్డే సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు బిగ్‌ షాక్‌.. ఇద్దరు కీలక ఆటగాళ్లు ఔట్‌!

IND vs NZ: భారత్‌తో వన్డే సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు బిగ్‌ షాక్‌.. ఇద్దరు కీలక ఆటగాళ్లు ఔట్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 02, 2026
09:21 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియాతో వన్డే సిరీస్‌ ప్రారంభానికి ముందే న్యూజిలాండ్‌ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాళ్లు మార్క్‌ చాప్‌మన్‌, రచిన్‌ రవీంద్ర ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు దూరమయ్యారు. గాయాల నుంచి వీరిద్దరూ ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో రిహాబిలిటేషన్‌ కేంద్రంలోనే చికిత్స పొందుతున్నట్లు న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు వెల్లడించింది. దీంతో భారత్‌తో సిరీస్‌కు ఎంపిక చేసిన జట్లలో మార్పులు చేస్తూ అప్‌డేటెడ్‌ స్క్వాడ్‌ను ప్రకటించింది. గాయాల కారణంగా అందుబాటులో లేని రచిన్‌ రవీంద్ర, మార్క్‌ చాప్‌మన్‌ స్థానాల్లో టిమ్‌ సీఫెర్ట్‌, హెన్రీ నికోల్స్‌, ఆల్‌రౌండర్‌ డీన్‌ ఫాక్స్‌క్రాఫ్ట్‌లకు అవకాశం కల్పించింది. వీరిలో టిమ్‌ సీఫెర్ట్‌ ఇప్పటికే నాలుగు, ఐదో వన్డేల కోసం ఎంపికయ్యాడు.

వివరాలు

గాయాల బారిన పడిన చాప్‌మన్‌, రచిన్‌..

తాజాగా అతడిని తొలి మూడు వన్డేలకు కూడా అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. హెన్రీ నికోల్స్‌ తొలి మూడు వన్డేల్లో ఆడనున్నాడు.

డీన్‌ ఫాక్స్‌క్రాఫ్ట్‌ చివరి రెండు మ్యాచ్‌లకు ఎంపికయ్యాడు. మరోవైపు పేసర్‌ మాట్‌ ఫిషర్‌ విషయంలోనూ న్యూజిలాండ్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

తొలుత నాలుగు, ఐదో వన్డేలకు మాత్రమే ఎంపికైన అతడిని తాజాగా సిరీస్‌ మొత్తం అందుబాటులో ఉండేలా జట్టులోకి తీసుకుంది.

మార్క్‌ చాప్‌మన్‌ యూరోపియన్‌ టీ20 ప్రీమియర్‌ లీగ్‌లో ఆడుతున్న సమయంలో కండరాల గాయానికి గురయ్యాడు. మరోవైపు రచిన్‌ రవీంద్ర ఓ షూట్‌ యాడ్‌ ప్రమోషన్‌లో పాల్గొంటున్న సమయంలో భుజానికి గాయమైంది.

అప్పటి నుంచి వీరిద్దరూ రిహాబిలిటేషన్‌ కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. పూర్తిస్థాయిలో కోలుకోకపోవడంతో భారత్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యారు

వివరాలు

నవంబర్‌ 4 నుంచి వన్డే సిరీస్‌..

ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత జట్టు 3-2తో కైవసం చేసుకుంది.

ఇప్పుడు ఇరు జట్లు ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తలపడనున్నాయి. నవంబర్‌ 4 నుంచి 15 వరకు ఈ సిరీస్‌ జరగనుంది.

బుధవారం ఆక్లాండ్‌ వేదికగా తొలి వన్డే మ్యాచ్‌ ప్రారంభం కానుంది. కీలక ఆటగాళ్లు దూరం కావడంతో న్యూజిలాండ్‌ జట్టు మార్పులతో కూడిన స్క్వాడ్‌తో బరిలోకి దిగనుంది

ADVERTISEMENT