Loading...
New Zealand: రెండో టెస్టుకు ముందు న్యూజిలాండ్‌కు షాక్.. గాయంతో బ్లెయిర్ టిక్నర్ ఔట్!
రెండో టెస్టుకు ముందు న్యూజిలాండ్‌కు షాక్.. గాయంతో బ్లెయిర్ టిక్నర్ ఔట్!

New Zealand: రెండో టెస్టుకు ముందు న్యూజిలాండ్‌కు షాక్.. గాయంతో బ్లెయిర్ టిక్నర్ ఔట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 24, 2026
11:23 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌తో క్రైస్ట్‌చర్చ్ వేదికగా శుక్రవారం (నవంబర్ 27) నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టుకు ముందు న్యూజిలాండ్ జట్టులో మార్పు చోటుచేసుకుంది. గాయంతో పేసర్ బ్లెయిర్ టిక్నర్ జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో మాట్ ఫిషర్‌ను కివీస్ జట్టు ఎంపిక చేసింది. ఈ మేరకు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అప్‌డేటెడ్ స్క్వాడ్‌ను ప్రకటించింది.

వివరాలు

గాయం తీవ్రత పెరగడంతో టిక్నర్ ఔట్

తొలి టెస్టు సమయానికే కండరాల నొప్పితో బాధపడుతున్న బ్లెయిర్ టిక్నర్ బెంచ్‌కే పరిమితమయ్యాడు.

తాజాగా గాయం తీవ్రత పెరగడంతో అతడిని టెస్టు జట్టు నుంచి విడుదల చేస్తున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది.

తొలి టెస్టు ప్రారంభానికి ముందు ప్రాక్టీస్ సమయంలో టిక్నర్ కుడి కండరాల నొప్పితో ఇబ్బందిపడ్డాడు. దీంతో తొలి టెస్టుకు దూరమయ్యాడు.

అయినప్పటికీ రెండో టెస్టులో అతడిని ఆడించాలని జట్టు యాజమాన్యం భావించింది.

అయితే అనూహ్యంగా గాయం తీవ్రత పెరగడంతో అతడిని జట్టు నుంచి తప్పించి, అతడి స్థానంలో మాట్ ఫిషర్‌ను తీసుకోవాలని నిర్ణయించింది.

వివరాలు

టిక్నర్ స్థానంలో ఫిషర్.. మరోసారి!

అంతకుముందు భారత్‌తో వన్డే సిరీస్ సమయంలోనూ టిక్నర్ గాయపడ్డాడు. రెండో వన్డేలో అన్షుల్ కాంబోజ్ వేసిన బంతి అతడి హెల్మెట్‌కు బలంగా తగలడంతో కంకషన్‌కు గురయ్యాడు.

అప్పుడు కూడా టిక్నర్ స్థానంలో మాట్ ఫిషర్ జట్టులోకి వచ్చాడు. తాజాగా రెండో టెస్టుకు ముందు టిక్నర్ గాయంతో దూరమవడంతో ఫిషర్‌కు మరోసారి అవకాశం దక్కింది.

ఇలా ఒకే ఆటగాడి స్థానంలో ఫిషర్ రెండుసార్లు జట్టులోకి రావడం యాదృచ్ఛికమనే చెప్పాలి.

ADVERTISEMENT

వివరాలు

వన్డేల్లో ఆకట్టుకున్న మాట్ ఫిషర్

టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్‌లో టిక్నర్ స్థానంలో వచ్చిన మాట్ ఫిషర్ తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. మూడు మ్యాచ్‌ల్లో కలిపి 4.56 ఎకానమీ రేటుతో ఆరు వికెట్లు పడగొట్టాడు.

ఇక 2025 ఆగస్టులో జింబాబ్వేతో జరిగిన టెస్టు మ్యాచ్‌తో ఫిషర్ టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీశాడు.

మొత్తంగా 16 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అతడు 60 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు రెండో టెస్టులోనూ తనకు వచ్చిన అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి.

ADVERTISEMENT