LOADING...
Lionel Messi: ఫుట్‌బాల్ అభిమానులకు పండుగ.. మెస్సీ హైద‌రాబాద్‌లో అడుగుపెట్టనున్న తేదీ ఫిక్స్!
ఫుట్‌బాల్ అభిమానులకు పండుగ.. మెస్సీ హైద‌రాబాద్‌లో అడుగుపెట్టనున్న తేదీ ఫిక్స్!

Lionel Messi: ఫుట్‌బాల్ అభిమానులకు పండుగ.. మెస్సీ హైద‌రాబాద్‌లో అడుగుపెట్టనున్న తేదీ ఫిక్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 28, 2025
05:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రసిద్ధ ఫుట్‌ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ భారత్‌ టూర్‌కు రానున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన హైద‌రాబాద్‌ను కూడా తన టూర్‌ లిస్ట్‌లో చేర్చుకున్నట్టు స్పష్టంగా ప్రకటించారు. ఈ సమాచారం ఆయన స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో వెల్లడించారు. మరికొన్ని వారాల్లో 'గోట్ టూర్' ప్రారంభం కానున్నదని, భారత ప్రజలు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలుపుతూ మెస్సీ ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈ టూర్‌లో హైద‌రాబాద్ నగరాన్ని చేర్చడం తనకు ఆనందంగా ఉందని అన్నారు. అర్జెంటీనా స్టార్‌ ఫుట్‌బాలర్‌ మెస్సీ భారతదేశంలో కోల్‌కతా, ముంబై, ఢిల్లీ నగరాలతో పాటు హైద‌రాబాద్‌లోనూ సందర్శించనున్నారు.

Details

డిసెంబర్ 13న రాక

డిసెంబ‌ర్‌ 13న మెస్సీ హైద‌రాబాద్‌కు రానున్నారు. ఆ రోజు రాత్రి 7.30కు ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. మెస్సీ రాక సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఇవాళ ట్వీట్‌ చేస్తూ హైద‌రాబాద్‌ నగరం ఈ లెజెండరీ ప్లేయర్‌ను స్వాగతించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఇది ఫుట్‌బాల్‌ అభిమానులకు, అలాగే హైద‌రాబాద్‌ ప్రజలకు ఎంతో సంతోషకరమైన విషయం అని పేర్కొన్నారు.

Advertisement