Loading...
India vs Pakistan: పాక్ చేతిలో భారత్ ఘోర ఓటమి.. టీమిండియా పరాజయానికి కారణమైన ముగ్గురు వీరే!
పాక్ చేతిలో భారత్ ఘోర ఓటమి.. టీమిండియా పరాజయానికి కారణమైన ముగ్గురు వీరే!

India vs Pakistan: పాక్ చేతిలో భారత్ ఘోర ఓటమి.. టీమిండియా పరాజయానికి కారణమైన ముగ్గురు వీరే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 24, 2026
10:53 am

ఈ వార్తాకథనం ఏంటి

దోహా వేదికగా జరుగుతున్న ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026లో భారత జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. టోర్నీలో భాగంగా జరిగిన 8వ మ్యాచ్‌లో తిలక్ వర్మ సారథ్యంలోని టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 49.2 ఓవర్లలో 314 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు తరఫున మాజ్ సదాకత్ (59), హసన్ నవాజ్ (79), ఫర్హాన్ యూసుఫ్ (56) అర్ధ సెంచరీలతో రాణించారు.

వివరాలు

తిలక్ వర్మ సెంచరీ వృథా

అనంతరం 315 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 49.1 ఓవర్లలో 265 పరుగులకే ఆలౌట్ అయింది.

కెప్టెన్ తిలక్ వర్మ (100) అద్భుత సెంచరీతో ఆకట్టుకోగా, అభిషేక్ శర్మ (70) హాఫ్ సెంచరీ సాధించాడు. వీరిద్దరూ రాణించినప్పటికీ మిగతా బ్యాటర్ల నుంచి ఆశించిన సహకారం లభించలేదు.

దీంతో భారత్ 48 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ పరాజయానికి కారణమైన ముగ్గురు ఆటగాళ్ల ప్రదర్శనపై ఓ లుక్కేద్దాం.

వివరాలు

1. రింకూ సింగ్

యువ బ్యాటర్ రింకూ సింగ్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు.

పాకిస్థాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో జట్టుకు అతడి నుంచి భారీ ఇన్నింగ్స్ అవసరమైన సమయంలో నిరాశపరిచాడు.

కేవలం 14 బంతులు ఎదుర్కొని 6 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. చెత్త షాట్ ఆడి వికెట్ సమర్పించుకోవడంతో భారత జట్టుపై ఒత్తిడి మరింత పెరిగింది.

ADVERTISEMENT

వివరాలు

2. హర్షిత్ రాణా

పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో భారత పేసర్ హర్షిత్ రాణా బౌలింగ్‌లో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. తన 10 ఓవర్ల కోటాలో 77 పరుగులు ఇచ్చి కేవలం 2 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.

పాక్ బ్యాటర్లు అతడి బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొని విరివిగా పరుగులు సాధించారు.

మ్యాచ్ ఆరంభంలో ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసినప్పటికీ, ఆ తర్వాత బౌలింగ్‌లో లయ కోల్పోయాడు. ఫలితంగా పాకిస్థాన్ భారీ స్కోరు సాధించడంలో అతడి బౌలింగ్ కూడా కీలకంగా మారింది.

ADVERTISEMENT

వివరాలు

3. వైభవ్ సూర్యవంశీ

యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కూడా పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో నిరాశపరిచాడు. మరోవైపు అభిషేక్ శర్మ దూకుడుగా ఆడి 70 పరుగులతో అర్ధ సెంచరీ సాధించగా.. వైభవ్ మాత్రం 11 పరుగులకే వెనుదిరిగాడు.

కీలకమైన మ్యాచ్‌లో అతడి నుంచి మంచి ఇన్నింగ్స్ ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది.

అతడి తక్కువ స్కోరు భారత జట్టు మేనేజ్‌మెంట్‌ను కూడా అసంతృప్తికి గురిచేసింది.

దీంతో పాకిస్థాన్‌పై టీమిండియా ఓటమికి కారణమైన ఆటగాళ్లలో వైభవ్ సూర్యవంశీ పేరు కూడా వినిపిస్తోంది.

ADVERTISEMENT