Loading...
FIFA World Cup: ఫిఫా వరల్డ్‌కప్‌లో తొలిసారి కొత్త చరిత్ర.. విజేతలకు ట్రోఫీతో పాటు మరో అరుదైన గౌరవం!
ఫిఫా వరల్డ్‌కప్‌లో తొలిసారి కొత్త చరిత్ర.. విజేతలకు ట్రోఫీతో పాటు మరో అరుదైన గౌరవం!

FIFA World Cup: ఫిఫా వరల్డ్‌కప్‌లో తొలిసారి కొత్త చరిత్ర.. విజేతలకు ట్రోఫీతో పాటు మరో అరుదైన గౌరవం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 17, 2026
11:26 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫిఫా ప్రపంచకప్‌-2026 విజేత జట్టుకు ఈసారి అరుదైన గౌరవం దక్కనుంది. ప్రపంచకప్‌ చరిత్రలో తొలిసారిగా ఛాంపియన్‌గా నిలిచే జట్టుకు ట్రోఫీ, స్వర్ణ పతకాలతో పాటు ప్రత్యేక 'ఛాంపియన్‌షిప్ రింగ్స్' కూడా అందజేయనున్నట్లు ఫిఫా అధికారికంగా ప్రకటించింది. అమెరికాలోని ప్రముఖ క్రీడల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ సంప్రదాయాన్ని ఇప్పుడు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లోనూ ప్రవేశపెడుతున్నారు. ఫైనల్‌ మ్యాచ్‌ ముగిసిన వెంటనే విజేత జట్టు కెప్టెన్‌, ప్రధాన కోచ్‌కు తాత్కాలిక ఛాంపియన్‌షిప్ రింగ్స్‌ను అందజేస్తారు. అనంతరం విజేత జట్టులోని సభ్యుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 30 రింగ్స్‌ను అధికారికంగా బహూకరిస్తారు. ప్రతి రింగ్‌పై ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ ప్రతిరూపంతో పాటు, విజేత దేశాన్ని ప్రతిబింబించే ప్రత్యేక డిజైన్ ఉంటుంది.

వివరాలు

రింగ్స్ అందజేత

అంతేకాదు, ప్రతి ఉంగరంపై ప్రత్యేక సీరియల్ నంబర్‌ను ముద్రించి, దాని ప్రామాణికతను నిర్ధారించే అధికారిక సర్టిఫికెట్‌ను కూడా అందిస్తారు.

ఈ ప్రత్యేక కార్యక్రమం కోసం మొత్తం 2,026 ఛాంపియన్‌షిప్ రింగ్స్ మాత్రమే తయారు చేయనున్నారు. వాటిలో 30 రింగ్స్‌ను ప్రపంచకప్ గెలిచిన జట్టుకు కేటాయిస్తారు.

మిగిలిన 1,996 రింగ్స్‌ను అధికారిక లైసెన్స్‌డ్ మెర్చండైజ్‌గా ప్రపంచవ్యాప్తంగా అభిమానుల కోసం అందుబాటులో ఉంచనున్నారు.

ఇదిలా ఉంటే 2026 ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌లో యూరప్ ఛాంపియన్ స్పెయిన్‌, డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా తలపడనున్నాయి.

సెమీఫైనల్లో ఫ్రాన్స్‌పై విజయం సాధించిన స్పెయిన్ ఫైనల్‌కు చేరుకోగా, అర్జెంటీనా వరుసగా రెండోసారి ప్రపంచకప్ ఫైనల్‌లో అడుగుపెట్టి టైటిల్‌ను నిలబెట్టుకునే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.

ADVERTISEMENT