Loading...
Kieron Pollard: టీ20ల్లో అరుదైన ఘనత.. కోల్పోయిన అగ్రస్థానాన్ని మళ్లీ దక్కించుకున్న పొలార్డ్
టీ20ల్లో అరుదైన ఘనత.. కోల్పోయిన అగ్రస్థానాన్ని మళ్లీ దక్కించుకున్న పొలార్డ్

Kieron Pollard: టీ20ల్లో అరుదైన ఘనత.. కోల్పోయిన అగ్రస్థానాన్ని మళ్లీ దక్కించుకున్న పొలార్డ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 28, 2026
11:13 am

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 క్రికెట్‌ చరిత్రలో వెస్టిండీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ పేరిట ఉన్న 14,890 పరుగుల రికార్డును పొలార్డ్‌ అధిగమించాడు. దీంతో గతంలో తాను కోల్పోయిన అగ్రస్థానాన్ని మరోసారి సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో క్రిస్‌ గేల్‌ పేరిట ఉన్న టీ20ల్లో అత్యధిక పరుగుల రికార్డును పొలార్డ్‌ బద్దలు కొట్టాడు. అయితే ఆగస్టులో బట్లర్‌ పొలార్డ్‌ను అధిగమించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.

వివరాలు

26 బంతుల్లోనే 65 పరుగులు

తాజాగా కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (CPL)లో భాగంగా సెయింట్‌ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌ తరఫున బరిలోకి దిగిన పొలార్డ్‌.. కేవలం 26 బంతుల్లోనే 65 పరుగులు బాదాడు.

ఈ ఇన్నింగ్స్‌తో బట్లర్‌ రికార్డును అధిగమించి టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా తన రికార్డును తిరిగి లిఖించుకున్నాడు.

వివరాలు

పొలార్డ్‌ రికార్డు.. జట్టుకు మాత్రం ఓటమి

అయితే పొలార్డ్‌ వ్యక్తిగతంగా అద్భుతమైన మైలురాయిని అందుకున్నప్పటికీ.. అతడి జట్టుకు మాత్రం విజయం దక్కలేదు.

ఈ మ్యాచ్‌లో సెయింట్‌ లూసియా కింగ్స్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టింది. ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌పై 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సెయింట్‌ లూసియా కింగ్స్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఈ టోర్నీలో ఆ జట్టు 200కుపైగా పరుగులు చేయడం ఇది రెండోసారి.

భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన సెయింట్‌ లూసియా కింగ్స్‌.. ఆ తర్వాత ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌ను నిలువరించి 36 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.

ADVERTISEMENT