LOADING...
Farooq: భారత క్రికెట్ దిగ్గజానికి అరుదైన గౌరవం.. ఆయన పేరు మీద ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో స్టాండ్!
భారత క్రికెట్ దిగ్గజానికి అరుదైన గౌరవం.. ఆయన పేరు మీద ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో స్టాండ్!

Farooq: భారత క్రికెట్ దిగ్గజానికి అరుదైన గౌరవం.. ఆయన పేరు మీద ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో స్టాండ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 22, 2025
10:20 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌ vs ఇంగ్లాండ్ నాలుగో టెస్టు సందర్భంగా, భారత క్రికెట్ దిగ్గజం ఫరూఖ్‌కు అరుదైన గౌరవం దక్కనుంది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ఉన్న ఒక స్టాండ్‌కు ఫరూఖ్ పేరు పెట్టాలని ల్యాంక్‌షైర్ కౌంటీ క్లబ్ నిర్ణయం తీసుకుంది. ఫరూఖ్ 10 ఏళ్ల పాటు ల్యాంక్‌షైర్ తరఫున క్రికెట్ ఆడినందుకుగాను, ఆయన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం కల్పిస్తున్నట్లు క్లబ్ సోమవారం వెల్లడించింది. ఇక వెస్టిండీస్‌ దిగ్గజం క్లైవ్ లాయిడ్ పేరును కూడా ఒక స్టాండ్‌కి ఇవ్వాలని క్లబ్ ప్రకటించింది.

 Details

 సేవలకు గుర్తుగా వాళ్ల పేర్లతో నామకరణం 

క్లబ్ వారిగా విడుదల చేసిన ప్రకటనలో ఫరూఖ్, లాయిడ్ ఇద్దరూ ల్యాంక్‌షైర్ క్లబ్ అభివృద్ధికి తోడ్పడ్డారు. వాళ్ల కృషికి గుర్తుగా మేము స్టాండ్లను వారి పేర్లతో నామకరణం చేస్తున్నాం. ఈ గౌరవానికి వారు పూర్తి స్థాయిలో అర్హులని పేర్కొంది. ఫరూఖ్ ఇంజనీర్ ల్యాంక్‌షైర్ తరఫున 1968 నుంచి 1976 మధ్యకాలంలో 175 మ్యాచ్‌లు ఆడారు. ఈ సమయంలో ఆయన 5,942 పరుగులు సాధించడమే కాకుండా, వికెట్ కీపర్‌గా 429 క్యాచ్‌లు, 35 స్టంపింగ్స్ నమోదు చేశారు. ఇదే కాక ల్యాంక్‌షైర్ నాలుగు సార్లు జిల్లెట్ కప్ విజేతగా నిలవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.