Loading...
Rohit Sharma: రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌గా హిట్‌మ్యాన్!
రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌గా హిట్‌మ్యాన్!

Rohit Sharma: రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌గా హిట్‌మ్యాన్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 03, 2026
05:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలోనూ భారత స్టార్‌ ఆటగాడు రోహిత్‌ శర్మ (Rohit Sharma) దూకుడుగా బ్యాటింగ్‌ చేశాడు. అయితే సెంచరీకి చేరువగా వచ్చి తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. రోహిత్‌ 85 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 92 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో రోహిత్‌ శర్మ వన్డే క్రికెట్‌లో అరుదైన ఘనతను సాధించాడు. వన్డే క్రికెట్‌ చరిత్రలో అత్యంత వేగంగా 10 వేల పరుగులు పూర్తి చేసిన ఓపెనర్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ పేరిట ఉండేది.

వివరాలు

సిక్స్‌ల జాబితాలోనూ..

సచిన్‌ 214 ఇన్నింగ్స్‌ల్లో వన్డేల్లో 10 వేల పరుగుల మైలురాయిని చేరుకోగా.. రోహిత్‌ శర్మ కేవలం 202 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు. దీంతో సచిన్‌ రికార్డును రోహిత్‌ అధిగమించాడు.

రోహిత్‌ శర్మ అంటేనే భారీ సిక్స్‌లకు పెట్టింది పేరు. వెస్టిండీస్‌తో మూడో వన్డేలోనూ అతడు మూడు సిక్స్‌లు బాదాడు.

దీంతో వెస్టిండీస్‌పై అన్ని ఫార్మాట్లలో కలిపి 100 సిక్స్‌లు కొట్టిన తొలి ఆటగాడిగా రోహిత్‌ శర్మ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

రోహిత్‌ శర్మ వెస్టిండీస్‌పై 68 మ్యాచ్‌ల్లోనే 100 సిక్స్‌ల మార్క్‌ను అందుకున్నాడు. ఇందులో వన్డేల్లోనే 47 సిక్స్‌లు ఉండటం విశేషం.

ADVERTISEMENT