Loading...
Big Bash League : బీబీఎల్‌ హిస్టరీలోనే రికార్డు డీల్‌.. ఫిన్‌ అలెన్‌పై కోట్ల వర్షం!
బీబీఎల్‌ హిస్టరీలోనే రికార్డు డీల్‌.. ఫిన్‌ అలెన్‌పై కోట్ల వర్షం!

Big Bash League : బీబీఎల్‌ హిస్టరీలోనే రికార్డు డీల్‌.. ఫిన్‌ అలెన్‌పై కోట్ల వర్షం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 11, 2026
09:54 am

ఈ వార్తాకథనం ఏంటి

బిగ్‌ బాష్‌ లీగ్‌ (Big Bash League - BBL)లో సంచలన మార్పు చోటుచేసుకుంది. న్యూజిలాండ్‌ విధ్వంసక ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ను మెల్‌బోర్న్‌ స్టార్స్‌ భారీ మొత్తానికి జట్టులోకి తీసుకుంది. అలెన్‌తో మూడు సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకున్న ఫ్రాంచైజీ.. ఈ డీల్‌తో బీబీఎల్‌ చరిత్రలోనే అత్యంత ఖరీదైన కాంట్రాక్ట్‌ను నమోదు చేసింది. గత సీజన్‌లో పర్థ్‌ స్కార్చర్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన ఫిన్‌ అలెన్‌.. ఇప్పుడు అదే జట్టుకు ప్రత్యర్థిగా బరిలోకి దిగనున్నాడు.

వివరాలు

తొలి ఏడాదే రూ.4 కోట్లకు పైగా..

ఫిన్‌ అలెన్‌కు తొలి సీజన్‌లో సుమారు 6 లక్షల ఆస్ట్రేలియన్‌ డాలర్లు అందనున్నాయి. భారత కరెన్సీలో ఈ మొత్తం రూ.4 కోట్లకు పైమాటే.

విదేశీ ఆటగాళ్ల డ్రాఫ్ట్‌ విధానాన్ని క్రికెట్‌ ఆస్ట్రేలియా (Cricket Australia) తొలగించిన తర్వాత ఫ్రాంచైజీలకు సాలరీ క్యాప్‌ విషయంలో మరింత వెసులుబాటు లభించింది.

దీంతో అలెన్‌ను సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీల మధ్య పోటీ పెరిగింది.

వివరాలు

స్కార్చర్స్‌కు భారీ దెబ్బ..

గత సీజన్‌లో పర్థ్‌ స్కార్చర్స్‌ టైటిల్‌ గెలవడంలో ఫిన్‌ అలెన్‌ కీలకంగా వ్యవహరించాడు.

అయితే డ్రాఫ్ట్‌ వ్యవస్థలో మార్పులు రావడంతో స్కార్చర్స్‌కు అలెన్‌ను రిటైన్‌ చేసుకునే పాత హక్కు లేకుండా పోయింది.

ఈ అవకాశాన్ని మెల్‌బోర్న్‌ స్టార్స్‌ అందిపుచ్చుకుంది. మెల్‌బోర్న్‌ స్టార్స్‌ కొత్త హెడ్‌ కోచ్‌ కామెరన్‌ వైట్‌తో ఫిన్‌ అలెన్‌కు గతంలోనే పరిచయం ఉంది.

ఎంఎల్‌సీ (MLC)లో శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌ తరఫున అలెన్‌ రెండు సీజన్లు ఆడాడు.

ADVERTISEMENT

వివరాలు

టీ20లో విధ్వంసక బ్యాటర్‌..

ఫిన్‌ అలెన్‌ ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన టీ20 బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు.

గత సీజన్‌లో పర్థ్‌ స్కార్చర్స్‌కు టైటిల్‌ అందించడంలో కీలకంగా నిలిచిన అతడు.. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో కేవలం 33 బంతుల్లోనే నాటౌట్‌ సెంచరీ సాధించాడు.

ఆ తర్వాత ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరఫున తన తొలి సెంచరీని కూడా నమోదు చేశాడు.

ADVERTISEMENT

వివరాలు

బీబీఎల్‌ శాలరీలపై మొదలైన చర్చ..

ఫిన్‌ అలెన్‌కు కుదిరిన ఈ రికార్డు డీల్‌తో బీబీఎల్‌ ఆటగాళ్ల శాలరీలపై మరోసారి చర్చ మొదలైంది.

మెల్‌బోర్న్‌ స్టార్స్‌ కెప్టెన్‌ మార్కస్‌ స్టోయినిస్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ వంటి ఆస్ట్రేలియా ఆటగాళ్లు లీగ్‌తో చాలాకాలంగా కొనసాగుతున్నప్పటికీ.. వారి పారితోషికం కొందరు విదేశీ ఆటగాళ్ల కంటే తక్కువగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.

అంతకుముందు అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ను 5 లక్షల ఆస్ట్రేలియన్‌ డాలర్లకు జట్టులోకి తీసుకుంది.

ఇప్పుడు ఫిన్‌ అలెన్‌కు లభించిన భారీ కాంట్రాక్ట్‌ బీబీఎల్‌లో విదేశీ ఆటగాళ్ల పారితోషికాలపై చర్చను మరింత పెంచింది.

ADVERTISEMENT