Loading...
Seema Kaliraman: మూడు ఫౌల్స్‌ తర్వాత అద్భుతం.. సీమా కళిరామన్‌కు కామన్వెల్త్‌ కాంస్యం!
మూడు ఫౌల్స్‌ తర్వాత అద్భుతం.. సీమా కళిరామన్‌కు కామన్వెల్త్‌ కాంస్యం!

Seema Kaliraman: మూడు ఫౌల్స్‌ తర్వాత అద్భుతం.. సీమా కళిరామన్‌కు కామన్వెల్త్‌ కాంస్యం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 31, 2026
09:36 am

ఈ వార్తాకథనం ఏంటి

కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు మరో పతకాన్ని భారత్ ఖాతాలో చేర్చారు. గురువారం జరిగిన మహిళల డిస్కస్ త్రో పోటీలో భారత అథ్లెట్ 'సీమ కళిరామన్' కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. పోటీ ఆరంభంలో వరుసగా మూడు ప్రయత్నాలు ఫౌల్‌గా నమోదైనప్పటికీ, ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్న సీమ 58.65 మీటర్ల దూరం డిస్కస్‌ను విసిరి కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. ఈ విభాగంలో మరో భారత అథ్లెట్ 'నిధి రాణి' కూడా పోటీపడగా, ఆమె నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకాన్ని చేజార్చుకుంది.

వివరాలు

సీమ కళిరామన్ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం

27 ఏళ్ల సీమ కళిరామన్ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం.

తల్లి అయిన తర్వాత కూడా పోటీల్లోకి తిరిగి వచ్చి తన ప్రతిభను నిరూపించింది.

ఇప్పటికే 2025 నేషనల్ గేమ్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన సీమ, ఇప్పుడు కామన్వెల్త్ క్రీడల్లో కాంస్య పతకంతో మరో గొప్ప విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

ADVERTISEMENT