
Mohamed shami: 'నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధం'.. షమీకి పెళ్లి ప్రపోజల్ చేసిన పాయల్ ఘోష్
ఈ వార్తాకథనం ఏంటి
భారత పేసర్ మహమ్మద్ షమీకి నటి,రాజకీయ నాయకురాలు పాయల్ ఘోష్ నుండి వివాహ ప్రతిపాదన వచ్చింది.
మహ్మద్ షమీకి రెండో భార్య కావాలని పాయల్ తన కోరికను వ్యక్తం చేసింది. అయితే అందుకు ఆమె ఒక కండిషన్ కూడా పెట్టింది. పాయల్ ప్రతిపాదనపై షమీ ఇంకా స్పందించలేదు.
ప్రపంచ కప్ 2023లో మహ్మద్ షమీ తన ఫాస్ట్ బౌలింగ్ తో అద్భుతమైన ప్రదర్శన చేసి ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విషయం తెలిసిందే.
షమీ టోర్నీలో కేవలం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడి 16 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
Details
మహ్మద్ షమీకి ప్రపోజ్ ట్వీట్ చేసిన పాయల్
ప్రపంచ కప్‌లో షమీ సాధించిన వికెట్ల కంటే.. ఈ పెళ్లి ప్రతిపాదనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నటి,రాజకీయ నాయకురాలు పాయల్ ఘోష్ షమీకి రెండో భార్య కావాలనే కోరికను వ్యక్తం చేసింది.
పాయల్ తన సోషల్ మీడియా x లో మహ్మద్ షమీకి ప్రపోజ్ ట్వీట్ చేసింది.షమీ నువ్వు ముందు నీ ఇంగ్లీష్ సరి చేసుకో(షమీ తుమ్ అప్నా ఇంగ్లీష్ సుధార్ లో).. అప్పుడు నేను నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని ట్వీట్ చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పాయల్ చేసిన ట్వీట్
#Shami Tum apna English sudharlo, I’m ready to marry you 🤣🤣
— Payal Ghoshॐ (@iampayalghosh) November 2, 2023
Details
మంచు మనోజ్ హీరోగా వచ్చిన ప్రయాణం సినిమాలో హీరోయిన్ గా పాయల్
పాయల్ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే వైరల్‌గా మారింది. అప్పటినుండి నెటిజన్లు పాయల్ ఘోష్ గురించిన సమాచారం కోసం వెతకడం ప్రారంభించారు.
పాయల్ 1992లో కోల్‌కతాలో జన్మించింది. ఆమె తన విద్యను సెయింట్ పాల్స్ మిషన్ స్కూల్‌లో పూర్తి చేసింది.
స్కాటిష్ చర్చి కాలేజీ నుండి పొలిటికల్ సైన్స్‌లో పట్టభద్రురాలైంది. పాయల్ నటి కావాలనుకొని ముంబైకి వచ్చింది.
అనంతరం తెలుగులో మంచు మనోజ్ హీరోగా వచ్చిన ప్రయాణం చిత్రంలో ఆమె నటించారు.
అక్టోబర్ 2020లో, ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టి, రాందాస్ అథవాలే రాజకీయ పార్టీలో చేరి పార్టీ మహిళా విభాగానికి ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు.