LOADING...
Mukul Choudhary: లాస్ట్ ఓవర్లో సిక్సర్ల వర్షం.. లక్నోకు విజయం అందించిన 21 ఏళ్ల ముకుల్ చౌదరి ఎవరంటే?
లాస్ట్ ఓవర్లో సిక్సర్ల వర్షం.. లక్నోకు విజయం అందించిన 21 ఏళ్ల ముకుల్ చౌదరి ఎవరంటే?

Mukul Choudhary: లాస్ట్ ఓవర్లో సిక్సర్ల వర్షం.. లక్నోకు విజయం అందించిన 21 ఏళ్ల ముకుల్ చౌదరి ఎవరంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 10, 2026
09:11 am

ఈ వార్తాకథనం ఏంటి

ఓటమి దాదాపు ఖాయం అనిపించిన వేళ... జట్టుకు అండగా ఎవరూ లేరా అని ఎదురుచూస్తున్న క్షణంలో... 21 ఏళ్ల యువకుడు ముందుకు వచ్చి 'నేనున్నాను' అని నిరూపించాడు. అదే లక్నో సూపర్ జెయింట్స్‌కు ఊపిరి పోసిన ముకుల్ చౌదరి కథ. ముకుల్ చౌదరి మెరుపు ఇన్నింగ్స్ ఐపీఎల్ 2026లో కేకేఆర్ (KKR)తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ తరఫున ఫినిషర్‌గా దిగిన ముకుల్ చౌదరి అద్భుత ప్రదర్శన చేశాడు. చివరి ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదుతూ మ్యాచ్‌ను లక్నో వైపు తిప్పేశాడు. కేవలం 27 బంతుల్లోనే 54 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇందులో ఏడు సిక్సర్లు ఉండటం విశేషం.

వివరాలు

లక్నో సూపర్ విక్టరీ

ముఖ్యంగా చివరి నాలుగు ఓవర్లలో ఒంటరి పోరాటంతో 54 పరుగులు రాబట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అతని ఈ ఇన్నింగ్స్ ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయేలా నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఆ జట్టులో రఘవంశీ 45, రోమన్ పావెల్ 39 నాటౌట్, అజింక్య రహానే 41 పరుగులతో రాణించారు. లక్ష్య ఛేదనలో లక్నో 7 వికెట్లు కోల్పోయినా చివరి బంతికి విజయం సాధించింది. ముకుల్ చౌదరి (54 నాటౌట్), ఆయుష్ బదోని (54) కీలక పాత్ర పోషించారు.

వివరాలు

ప్రతిభకు పునాది

ముకుల్ ప్రతిభ వెలుగులోకి రావడానికి 2025/26 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కీలక వేదికగా నిలిచింది. రాజస్థాన్ తరఫున ఆడిన అతడు 57 సగటుతో 173 పరుగులు చేశాడు. దాదాపు 200 స్ట్రైక్ రేట్‌తో మెరుపులు మెరిపించాడు. అంతకుముందు ఏజ్ గ్రూప్ పోటీల్లో వరుస సెంచరీలతో 600కు పైగా పరుగులు చేసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. రూ.2.60 కోట్లతో కొనుగోలు ఈ ప్రదర్శనలతో ఐపీఎల్ వేలంలో ముకుల్ కోసం ముంబై ఇండియన్స్, లక్నో జట్లు పోటీ పడ్డాయి. చివరికి రూ.2.60 కోట్లకు లక్నో అతన్ని దక్కించుకుంది. రాజస్థాన్‌లోని జుంజును జిల్లా నుంచి జైపూర్‌కు వచ్చిన ముకుల్, కార్తీక్ శర్మ, అశోక్ శర్మ వంటి ఆటగాళ్లు ఎదిగిన అకాడమీలో శిక్షణ పొందాడు.

Advertisement

వివరాలు

అనుకోకుండా వికెట్ కీపర్

ముకుల్ అసలు వికెట్ కీపర్ కాదు. అకాడమీ మ్యాచ్‌లలో కీపర్ లేకపోవడంతో ఆ బాధ్యత చేపట్టాడు. అదే అతని కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. అలాగే SMATలో కార్తీక్ శర్మ గాయపడటంతో వచ్చిన అవకాశాన్ని ముకుల్ అద్భుతంగా వినియోగించుకున్నాడు. ముకుల్ తన ఆదర్శంగా ఎంఎస్.ధోనిని ఎంచుకున్నాడు. ధోనీలా మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లి ఫినిష్ చేయాలనే లక్షణం అతని ఆటలో కనిపించింది. నిన్నటి మ్యాచ్‌లో కూడా అదే తీరుతో జట్టును గెలిపించి తన సత్తా చాటాడు.

Advertisement