ల్యాండ్‌మైన్‌పై అడుగుపెట్టి కాలు కోల్పోయిన సైనికుడు.. ఆసియా గేమ్స్‌లో ఇండియా తరుపున ప్రాతినిథ్యం
ఇండియన్ ఆర్మీ సైనికుడు సోమేశ్వరరావు జమ్మూకాశ్మీర్‌లోని ఓ ప్రాంతంలో ల్యాండ్ మెన్ పై అడుగు వేసి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో తన కాలును కోల్పోయాడు. గాయంతోనూ అతను ఇంకా పోరాడుతున్నాడు. జీవితంపై విరక్తి చెందిన అతను ఓసారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇలాంటి తరుణంలో తన తల్లి చెప్పిన మాటలు అతనిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా మళ్లీ జీవితంలో విజయం సాధించాలని ముందుకెళ్లాడు. ఆర్మీపారా ట్రాయాథ్లెట్ లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ్ దత్తా స్ఫూర్తితో బ్లేడ్-రన్నర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. తర్వాత అటు నుంచి లాంగ్ జంప్ కు మారాడు. ప్రస్తుతం అతను ఈ ఏడాది చివర్లో హాంగ్‌జౌలో జరిగే పారా ఆసియా క్రీడల్లో ఇండియా తరుపున ప్రాతినిథ్యం వహించడానికి సిద్ధమయ్యాడు.
యువకులకు ఆదర్శంగా సోమేశ్వరరావు
సోమేశ్వరరావు ప్రస్తుతం ఎంతోమందికి యువకులకు స్ఫూర్తిగా నిలిచాడు. మంగళవారం న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ట్రయల్స్‌కు అతను హజరయ్యారు. తాము మందుపాతర తనిఖీ చేయడానికి వెళ్లినప్పుడు చీకట్లో ఏమీ కనపడలేదని, అయితే మరుసటి రోజు ఉదయం తాము అక్కడినుంచి తిరిగొస్తుండగా తాను ల్యాండ్‌మైన్‌పై అడుగుపెట్టడంతో తన ఎడమ కాలును కోల్పోయాయని సోమేశ్వరావు పేర్కొన్నారు. 2017లో జరిగిన ఈ ఘటన తర్వాత అతనికి అడ్మినిస్ట్రేటివ్ పోస్టింగ్ లభించినా అతను సంతృప్తి చెందలేదు. లెఫ్టినెంట్ కల్నల్ దత్తా జోక్యంతో సోమశ్వరరావు క్రీడల్లో తన రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. సోమేశ్వరరావు గాయపడినా మళ్లీ తిరిగి ఆసియా క్రీడల్లో రాణిస్తుండడం గర్వకారణమని అతని కోచ్ లు వెల్లడించారు.