
Heart Attack: షటిల్ ఆడుతున్న సమయంలో గుండెపోటు.. అక్కడిక్కడే ప్రాణాలు విడిచిన యువకుడు!
ఈ వార్తాకథనం ఏంటి
గుండెపోటు మరణాలు రోజురోజుకూ పెరుగుతూ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చాలామంది గుండెపోటుతో అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఆరోగ్యంగా, ఉల్లాసంగా కనిపించిన వ్యక్తులు ఒక్కసారిగా క్షణాల్లోనే కుప్పకూలిపోతున్నారు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే తుది శ్వాస విడిచే ఘటనలు తరచూ జరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలోని నాగోల్‌లో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది.
Details
సీపీఆర్ చేసినా ఫలితం లేదు
నాగోల్ స్టేడియంలో షటిల్ ఆడుతుండగా గుండ్ల రాకేష్ అనే 25 ఏళ్ల యువకుడు హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. ఆయనను గమనించిన స్నేహితులు వెంటనే సీపీఆర్ (CPR) చేసినా ఫలితం లేకుండా పోయింది. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినా వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడు ఖమ్మం జిల్లా తల్లాడ మండలానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కుమారుడు గుండ్ల రాకేష్‌గా గుర్తించారు.