LOADING...
FIDE Grand Swiss: గుకేశ్‌కు షాకిచ్చిన యువ గ్రాండ్ మాస్టర్‌ అభిమన్యు మిశ్రా
గుకేశ్‌కు షాకిచ్చిన యువ గ్రాండ్ మాస్టర్‌ అభిమన్యు మిశ్రా

FIDE Grand Swiss: గుకేశ్‌కు షాకిచ్చిన యువ గ్రాండ్ మాస్టర్‌ అభిమన్యు మిశ్రా

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 09, 2025
11:22 am

ఈ వార్తాకథనం ఏంటి

2025 ఫిడె గ్రాండ్ స్విస్‌ టోర్నమెంట్‌లో భారత చెస్ స్టార్ గుకేశ్‌ను అమెరికా యువ గ్రాండ్ మాస్టర్ అభిమన్యు మిశ్రా ఓడించాడు. 16 ఏళ్ల వయసులోనే ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించి చరిత్ర సృష్టించాడు. ఈ గెలుపును మిశ్రా 61 ఎత్తుగడలలో సాధించి, అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అయితే ఈ విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ మిశ్రా తన ప్రదర్శనతో సంతృప్తి చెందలేదు!

వివరాలు 

ప్రజ్ఞానంద్‌కు కూడా షాక్

అభిమన్యు మిశ్రా మాట్లాడుతూ, "నేను గెలిచినప్పటికీ,ఈ టోర్నమెంట్ నా ముందు జరిగిన గేమ్స్‌ల్లా ఎంతటి ఆసక్తికరంగా అనిపించలేదు.అయితే మొత్తంగా చూస్తే,ఇది నేను ఊహించినదికంటే బాగా సాగుతోంది. నా ప్రస్తుత ఫామ్‌ను కొనసాగిస్తే ఈ టోర్నమెంట్‌ను గెలవడం అసాధ్యం కాదు. నిన్న కూడా నేను ప్రాగ్‌పై కొన్ని తప్పులు చేశాను.కానీ గుకేశ్, ప్రాగ్ లాంటి అద్భుత ఆటగాళ్ల కంటే నేను తక్కువనని నాకు ఎప్పుడూ అనిపించలేదు. నేను వారితో ఎప్పుడూ సమంగా ఉన్నానని నమ్ముతున్నాను" అని మిశ్రా తన విజయం అనంతరం చెప్పాడు. ఇక మరో కీలక మ్యాచ్‌లో, భారత గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద్‌కు కూడా షాక్ తగిలింది. జర్మనీలో జరిగే ఈ టోర్నమెంట్‌లో మథియాస్ బ్లూబామ్ ప్రజ్ఞానంద్‌ను 55 ఎత్తుగడల్లో ఓడించాడు.