LOADING...
Abhishek Sharma: రూల్స్ బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ.. భారీ జరిమానా, డీమెరిట్ పాయింట్ షాక్!
రూల్స్ బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ.. భారీ జరిమానా, డీమెరిట్ పాయింట్ షాక్!

Abhishek Sharma: రూల్స్ బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ.. భారీ జరిమానా, డీమెరిట్ పాయింట్ షాక్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 03, 2026
09:40 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా యువ ఆటగాడు, సన్‌ రైజర్స్ హైదరాబాద్ (SRH) స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) నుంచి షాక్ తగిలింది. గురువారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నిబంధనలు ఉల్లంఘించినందుకు అతనిపై మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కూడా నమోదు చేశారు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 48 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాటింగ్‌తో అభిమానులను అలరించినప్పటికీ, మైదానంలో అతని ప్రవర్తన మాత్రం వివాదానికి దారితీసింది.

వివరాలు

65 పరుగుల తేడాతో గెలుపు

ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.3 ప్రకారం మ్యాచ్ సమయంలో అసభ్య పదజాలం ఉపయోగించినందుకు లెవల్-1 నేరంగా పరిగణించి శిక్ష విధించారు. ఈ తప్పును అభిషేక్ శర్మ స్వయంగా అంగీకరించడంతో మ్యాచ్ రిఫరీ నిర్ణయం ఖరారైంది. ఐపీఎల్ క్రమశిక్షణ నిబంధనల ప్రకారం లెవల్-1 నేరాలు తక్కువ తీవ్రత కలిగినవే అయినప్పటికీ, ఇలాంటి తప్పిదాలు పునరావృతమైతే డీమెరిట్ పాయింట్లు పెరిగి భవిష్యత్తులో సస్పెన్షన్‌కు దారితీసే అవకాశముంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే, సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శనతో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

వివరాలు

161 పరుగులకే కుప్పకూలిన కేకేఆర్

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు ట్రావిస్ హెడ్ (46), అభిషేక్ శర్మ (48) జోడీ కేవలం 34 బంతుల్లోనే 82 పరుగుల భాగస్వామ్యంతో వేగవంతమైన ఆరంభం ఇచ్చింది. అనంతరం హెన్రిచ్ క్లాసెన్ (52) హాఫ్ సెంచరీతో రాణించగా, నితీష్ కుమార్ రెడ్డి (39) కీలక పరుగులు జోడించడంతో ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరు సాధించింది. 227 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ జట్టు 16 ఓవర్లలోనే 161 పరుగులకు కుప్పకూలింది. జట్టులో రఘువంశీ (52) మాత్రమే కొంత పోరాడగా, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.

Advertisement