
Abhishek Sharma : చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. టీ20లో అరుదైన ఘనత
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. దుబాయ్‌లో ఆదివారం (సెప్టెంబర్ 21) పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి బంతికే సిక్స్ బాదిన అతడు, అంతర్జాతీయ టీ20ల్లో రెండు సార్లు మొదటి బంతికే సిక్స్ కొట్టిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీలోనే యూఏఈపై తొలిసారి ఈ ఘనత సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌లో అభిషేక్ మరో వరల్డ్ రికార్డును నెలకొల్పాడు. అతి తక్కువ బంతులు, అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో అంతర్జాతీయ క్రికెట్‌లో 50 సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డుల బరిలో నిలిచాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ ఆటగాడు ఎవిన్ లూయిస్ రికార్డును అధిగమించాడు.
Details
అతి తక్కువ బంతుల్లో 50 సిక్సర్లు బాదిన ఆటగాళ్లు
అభిషేక్ శర్మ (భారత్) - 331 బంతులు ఎవిన్ లూయిస్ (వెస్టిండీస్) - 366 బంతులు ఆండ్రే రస్సెల్ (వెస్టిండీస్) - 409 బంతులు హజ్రతుల్లా జజాయ్ (అఫ్గానిస్తాన్) - 492 బంతులు సూర్యకుమార్ యాదవ్ (భారత్) - 510 బంతులు అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 50 సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు అభిషేక్ శర్మ (భారత్) - 20 ఇన్నింగ్స్‌లు ఎవిన్ లూయిస్ (వెస్టిండీస్) - 20 ఇన్నింగ్స్‌లు హజ్రతుల్లా జజాయ్ (అఫ్గానిస్తాన్) - 22 ఇన్నింగ్స్‌లు క్రిస్ గేల్ (వెస్టిండీస్) - 25 ఇన్నింగ్స్‌లు సూర్యకుమార్ యాదవ్ (భారత్) - 29 ఇన్నింగ్స్‌లు
Details
అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ ఆటగాడిగా రికార్డు
ఇక పాక్‌పై అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన భారత ఆటగాడిగా కూడా అభిషేక్ శర్మ రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు ఈ రికార్డు యువరాజ్ సింగ్ పేరిట ఉండగా, 2012లో అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో యువీ 29 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. అయితే, అభిషేక్ కేవలం 24 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. అతనితో పాటు శుభ్మన్ గిల్ 28 బంతుల్లో 8 ఫోర్లు బాదుతూ 47 పరుగులు చేశాడు. తిలక్ శర్మ 19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 నాటౌట్ చేశాడు.
Details
రెండు వికెట్లతో చెలరేగిన శిమ్ దూబే
వీరి బ్యాటింగ్‌తో టీమిండియా 172 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి అందుకుంది. దీని ముందు పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. సాహిబ్జాదా ఫర్హాన్ 45 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 58 పరుగులు సాధించాడు. భారత బౌలర్లలో శివమ్ దూబే 2 వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తీసుకున్నారు.