Abhishek Sharma: అభిషేక్ శర్మకు అసౌకర్యం.. హద్దు మీరిన మహిళా అభిమాని! (వీడియో)
ఈ వార్తాకథనం ఏంటి
సెలబ్రిటీలను చూసిన వెంటనే అభిమానులు సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడటం సాధారణమే. కానీ కొందరు హద్దులు దాటి ప్రవర్తించడం వల్ల వారికి అసౌకర్యకర పరిస్థితులు ఎదురవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన టీమిండియా యువ క్రికెటర్, అభిషేక్ శర్మకు ఎదురైంది. ఐపీఎల్ 2026లో భాగంగా జరిగిన మ్యాచ్ కోసం హోటల్‌లో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న అభిషేక్, తన గదికి వెళ్తుండగా ఓ మహిళా అభిమాని ఒక్కసారిగా అతడి చేతిని పట్టుకుని లాగింది. దీంతో వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది ఆమె నుంచి అతడిని విడిపించారు. ఈ సంఘటనలో అభిషేక్ తీవ్ర అసౌకర్యానికి గురైనట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
వివరాలు
యువతి ప్రవర్తనపై ఆగ్రహం
ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్పై సన్‌రైజర్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. "ఇదే పని ఒక పురుష అభిమాని మహిళా క్రీడాకారిణిపై చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు ఆ యువతి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అభిమానానికి కూడా హద్దులు ఉండాలని సూచిస్తున్నారు. క్రీడాకారులు కూడా వ్యక్తిగత గౌరవం, ప్రైవసీ కలిగిన వ్యక్తులేనని, వారిని ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించడం తగదని సోషల్ మీడియా వేదికగా పలువురు అభిప్రాయపడుతున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో
Abhishek was going to his hotel room and a girl held his hand which made him uncomfortable. Just imagine the outrage if a boy did this to women’s team. The worst part is that her boyfriend was there how embarrassed he must have felt 🥲 pic.twitter.com/ZpxAhd87uz
— ` (@8eenpoint5) April 25, 2026