
IND vs PAK: విజృంభించిన అభిషేక్ శర్మ.. పాక్‌పై టీమిండియా సూపర్ విక్టరీ
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ సూపర్ ఫోర్‌లో మరోసారి పాకిస్థాన్‌ను టీమిండియా చిత్తు చేసింది. దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచులో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ (58; 45 బంతుల్లో 5×4, 3×6) హాఫ్ సెంచరీతో మెరిసాడు. లక్ష్య చేధనలో టీమిండియా 18.5 ఓవర్లో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది. భారత ఓపెనర్లు మొదటి వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. అభిషేక్ శర్మ (74), శుభమాన్ గిల్(47)రన్స్‌తో పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు.
Details
రెండు వికెట్లతో రాణించినా శివం దూబె
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (0), సంజు శాంసన్ (13) విఫలమైనా, చివర్లో తిలక్ వర్మ(30*), హార్ధిక్ పాండ్యా(7*) మ్యాచ్ ను ముగించారు. భారత్ బౌలర్లలో శివమ్ దూబె 2 వికెట్లు పడగొట్టగా.. హార్దిక్, కుల్‌దీప్ చెరో వికెట్ తీశారు.
Details
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
అభిషేక్ శర్మ పాకిస్థాన్‌పై చరిత్రను సృష్టించాడు. అతను టీ20ల్లో 50 సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ప్రపంచంలోనే అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్ గా నిలిచాడు. కేవలం 21 మ్యాచ్‌లలో 50 సిక్సర్లు బాదడం విశేషం.