Loading...
IND vs NZ: అభిషేక్‌ శర్మ విధ్వంసం.. న్యూజిలాండ్‌పై భారత్‌ ఘన విజయం!
అభిషేక్‌ శర్మ విధ్వంసం.. న్యూజిలాండ్‌పై భారత్‌ ఘన విజయం!

IND vs NZ: అభిషేక్‌ శర్మ విధ్వంసం.. న్యూజిలాండ్‌పై భారత్‌ ఘన విజయం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 27, 2026
03:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

అభిషేక్‌ శర్మ, వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో టీమిండియా మూడో టీ20లో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. కేవలం 13.2 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి 199 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే టీమిండియా సొంతం చేసుకుంది.

వివరాలు

35 బంతుల్లో అభిషేక్‌ శర్మ సెంచరీ

ఈ మ్యాచ్‌లో అభిషేక్‌ శర్మ తన బ్యాటింగ్‌ సత్తాను మరోసారి చాటుకున్నాడు. తన కెరీర్‌లో నాలుగో టీ20 అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు.

కేవలం 35 బంతుల్లోనే శతక మైలురాయిని చేరుకుని న్యూజిలాండ్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరోవైపు, యువ ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ కూడా అద్భుతంగా ఆడాడు.

కేవలం 19 బంతుల్లోనే 45 పరుగులు సాధించి భారత ఇన్నింగ్స్‌కు మెరుపు ఆరంభాన్ని అందించాడు.

అభిషేక్‌, వైభవ్‌ కలిసి చేసిన విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత జట్టు పరుగుల వరద పారించింది. వీరిద్దరి దూకుడుతో ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది.

వివరాలు

ఐదు ఓవర్లలోనే 100 పరుగులు

భారత బ్యాటర్లు ఎంతటి దూకుడుతో ఆడారో చెప్పడానికి ఐదు ఓవర్లలోనే సాధించిన స్కోరే నిదర్శనం.

టీమిండియా కేవలం ఐదు ఓవర్లలోనే 100 పరుగుల మార్కును అందుకుంది. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా జట్టు శతకాన్ని నమోదు చేసిన ఘనతను సాధించింది.

పవర్‌ప్లేలోనూ ప్రపంచ రికార్డు

పరుగుల వేగాన్ని ఏమాత్రం తగ్గించని భారత ఓపెనర్లు పవర్‌ప్లేలోనూ సరికొత్త రికార్డు సృష్టించారు.

తొలి ఆరు ఓవర్లు ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా భారత్‌ 118 పరుగులు చేసింది. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో పవర్‌ప్లేలో నమోదైన అత్యధిక స్కోరు

ADVERTISEMENT