LOADING...
2022లో టేబుల్ టెన్నిస్‌లో శరత్ కమల్‌కు అరుదైన గుర్తింపు
భాతర్ టెన్నిస్ ఆటగాళ్లు శరత్ కమల్, మణికా బత్రా

2022లో టేబుల్ టెన్నిస్‌లో శరత్ కమల్‌కు అరుదైన గుర్తింపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 26, 2022
10:13 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ అగ్రశేణి టేబుల్ టెన్నిస్ ఆటగాడు శరత్ కమల్, మణికా బత్రా టేబుల్ టెన్నిస్ లో అత్యుత్తమ ప్రతిభ చూపారు. 16 ఏళ్ల తరువాత బర్నింగ్ హామ్లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో మూడు బంగారు పతకాలు సాధించి, శబాష్ అనుపించుకున్నాడు శరత్ కమల్. శరత్ కమల్ టెన్నిస్ కోర్టులో అద్భుత రికార్డులను నమోదు చేశాడు. 12 ఏళ్లుగా టెబుల్ టెన్నిస్‌లో సంక్షోభం ఉన్నప్పటికి టేబుల్ టెన్నిస్‌ను ఫస్ట్‌లో నిలపడానికి కృషి చేశాడు. మొదట ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అథ్లెట్ల కమిషన్ వైస్ చైర్మన్ ఎన్నికయ్యాడు. తర్వాత అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ ఫేడరేషన్ ఆటగాళ్ల సంయుక్త అధ్యక్షుడిగా ఎన్నికైనా మొదటి భారతీయుడిగా నిలిచాడు. అనంతరం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకున్నాడు.

మణికా బత్రా

కాంస్యం సాధించిన మొదటి భారతీయురాలిగా మణికాబత్రా

బర్నింగ్ హామ్ లో 2018 CWG మనికా నాలుగు పతకాలు సాధించి, మెరుగైన ప్రదర్శన చేశారు. అమెపై అంచనాలు ఎక్కువ కావడంతో వాటిని అధిగమించలేక ఖాళీ చేతులతో ఇంటికొచ్చింది. 3నెలల తర్వాత బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా కప్‌లో తన పేరిట రికార్డులను నమోదు చేసింది. మూడు రోజుల వ్యవధిలో ఇద్దరు టాప్-10 ఆటగాళ్లను ఓడించి కాంస్యం సాధించింది. ఈ టోర్నమెంట్ చరిత్రలో పతకాన్ని సాధించుకున్న మొదటి భారతీయురాలుగా నిలిచింది. తెలంగాణకు చెందిన టేబుల్ టెన్నిస్ సంచలనం ఆకుల శ్రీజ టర్కీలోని ఇస్తాంబుల్‌ వేదికగా జరిగిన వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి దేశ ఖ్యాతిని పెంపొందించింది. జూలై-ఆగస్టులో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్‌లో ప్రస్తుతం సస్పెన్షన్ ఆటగాళ్లలో భయం నెలకొంది.