The Ashes 2025-26: అడిలైడ్ టెస్ట్.. హెడ్ సెంచరీతో పట్టు బిగించిన ఆస్ట్రేలియా
ఈ వార్తాకథనం ఏంటి
యాషెస్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా జట్టు పట్టు సాధించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 66 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఆస్ట్రేలియా మొత్తం 356 పరుగుల లీడ్‌లో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 196 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 142 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు అలెక్స్ కేరీ 91 బంతుల్లో 4 ఫోర్లతో 52 పరుగులు చేసి హాఫ్ సెంచరీ సాధించాడు.
Details
రాణించిన జోఫ్రా ఆర్చర్
మూడో రోజు ఆట ముగిసే సమయానికి హెడ్, కేరీ ఐదో వికెట్‌కు అజేయంగా 175 బంతుల్లో 122 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేశారు. అంతకుముందు 213/8 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు 286 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో బెన్ స్టోక్స్ 198 బంతుల్లో 8 ఫోర్లతో 83 పరుగులు చేయగా, జోఫ్రా ఆర్చర్ 105 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 51 పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియా బౌలింగ్‌లో పాట్ కమిన్స్, స్కాట్ బోల్యాండ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
Details
తక్కువ స్కోరుకే పరిమతమైన గ్రీన్
నాథన్ లైయన్ రెండు వికెట్లు తీసుకోగా, కామెరూన్ గ్రీన్, మిచెల్ స్టార్క్ తలో వికెట్ సాధించారు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో జేక్ వెదర్లాడ్ (1), మార్నస్ లబుషేన్ (13), కామెరూన్ గ్రీన్ (7) నిరాశపరిచారు. ఉస్మాన్ ఖవాజా మాత్రం 51 బంతుల్లో 4 ఫోర్లతో 40 పరుగులు చేసి రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన గ్రీన్, రెండో ఇన్నింగ్స్‌లోనూ తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ రెండు వికెట్లు తీయగా, బ్రైడన్ కార్స్, విల్ జాక్స్ తలో వికెట్ సాధించారు.