LOADING...
AFG vs HK: ఆసియా కప్‌ ఆరంభం మ్యాచులో సత్తా చాటిన అఫ్గానిస్థాన్‌.. హాంకాంగ్‌పై 94 పరుగుల విజయం!
ఆసియా కప్‌ ఆరంభం మ్యాచులో సత్తా చాటిన అఫ్గానిస్థాన్‌.. హాంకాంగ్‌పై 94 పరుగుల విజయం!

AFG vs HK: ఆసియా కప్‌ ఆరంభం మ్యాచులో సత్తా చాటిన అఫ్గానిస్థాన్‌.. హాంకాంగ్‌పై 94 పరుగుల విజయం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 10, 2025
12:26 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్‌ టీ20 టోర్నమెంట్‌ జోరుగా ప్రారంభమైంది. హాంకాంగ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ 94 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. సెధిఖుల్లా అటల్‌ (73; 52 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అద్భుతంగా ఆడగా, చివర్లో అజ్మతుల్లా ఒమర్జాయ్‌ (53; 21 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) రాణించాడు. వీరిద్దరి బ్యాటింగ్‌తో జట్టు భారీ స్కోరు నమోదు చేసింది.

Details

  హాంకాంగ్‌ చెత్త ప్రదర్శన

లక్ష్యఛేదనకు దిగిన హాంకాంగ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 94 పరుగులు మాత్రమే చేయగలిగింది. బ్యాటర్లలో బాబర్ హయత్‌ (39; 43 బంతుల్లో) ఒక్కరే నిలదొక్కుకోగా, మిగతా వారంతా విఫలమయ్యారు. ఒక దశలో జట్టు స్కోరు 22 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత హయత్‌ పోరాటం వల్లే స్కోరు మూడు అంకెల దగ్గరికి చేరింది. హాంకాంగ్‌ తరఫున యాసిమ్‌ ముర్తాజా (16), జీషన్‌ అలీ (5), కించిత్‌ షా (6), ఐజాజ్‌ ఖాన్‌ (6), ఎషాన్‌ ఖాన్‌ (6), కల్హన్‌ (4) పరుగులు చేశారు. నిజాకత్‌ ఖాన్‌, అంషుమన్‌ రాత్‌ డకౌటయ్యారు.

Details

అఫ్గాన్‌ బౌలర్ల దెబ్బ

అఫ్గానిస్థాన్‌ బౌలర్లు హాంకాంగ్‌ బ్యాటర్లను దారుణంగా కట్టడి చేశారు. ఫజల్‌ హక్‌ ఫారూఖీ 2 వికెట్లు, గుల్బాదిన్‌ నైబ్‌ 2 వికెట్లు తీశారు. అజ్మతుల్లా ఒమర్జాయ్‌, నూర్‌ అహ్మద్‌, రషీద్‌ ఖాన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. ఆరంభ మ్యాచ్‌లోనే అఫ్గానిస్థాన్‌ 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఆసియా కప్‌లో గొప్ప ఆరంభం చేసింది.