
Irfan Pathan: ఆ మాటతో ఆఫ్రిది వెనక్కి తగ్గాడు : ఇర్ఫాన్ పఠాన్
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది నోటి దురుసు ఇప్పుడే కాదని, అతని ఆట రోజుల్లోనూ ఎక్కువగానే ఉండేదని ఇర్ఫాన్ పఠాన్ గుర్తుచేశాడు. ఒకసారి తనకూ అఫ్రిది వల్ల చేదు అనుభవం ఎదురైందని, కానీ వెంటనే కౌంటర్ ఇచ్చి అతడిని సైలెంట్ చేశానని చెప్పాడు. 2006లో భారత జట్టు పాకిస్థాన్ పర్యటనలో జరిగిన ఘటనను ఇర్ఫాన్ తాజాగా వెల్లడించాడు. ఇర్ఫాన్ చెప్పిన ప్రకారం - ''మేం 2006లో పాకిస్థాన్ పర్యటనలో భాగంగా కరాచీ నుంచి లాహోర్‌కి ఒకే ఫ్లైట్‌లో ప్రయాణించాం. నేను నా సీట్‌లో కూర్చుంటే అఫ్రిది వచ్చి నా తలపై చేయి వేసి, 'ఎలా ఉన్నావు బాబు?' అని అడిగాడు.
Details
ఇర్ఫాన్ మాటలకు షాక్ అయిన రజాక్
అప్పుడు నేను, 'నువ్వెప్పుడు నా తండ్రివి అయ్యావు?' అని ప్రశ్నించా. ఇవన్నీ పిల్ల చేష్టలు. అతడు నా స్నేహితుడు కూడా కాదు. ఆ తర్వాత అఫ్రిది కొన్ని అసభ్య పదాలు వాడాడు. ఆ సమయంలో అతడి సీట్ నాకు దగ్గరగానే ఉండేది. మరోవైపు అబ్దుల్ రజాక్ కూర్చున్నాడని వివరించాడు. 'అప్పుడు నేను రజాక్‌ని చూసి, 'ఇక్కడ ఏ మాంసం దొరుకుతుంది?' అని అడిగాను. అతడు కొన్ని రకాల మాంసం పేర్లు చెప్పాడు. వెంటనే, 'ఇక్కడ కుక్క మాంసం దొరుకుతుందా?' అని అడిగాను. నా ప్రశ్న విని రజాక్ మాత్రమే కాదు, అఫ్రిది కూడా షాక్ అయ్యాడు.
Details
ఆఫ్రిది మెరుగుతూనే ఉన్నాడు
అప్పుడు రజాక్ - 'హే ఇర్ఫాన్, ఎందుకు అలా అన్నావు?' అని అడిగాడు. దానికి నేను, 'ఏం లేదు.. అఫ్రిది కుక్క మాంసం తిన్నాడేమో.. చాలా సేపటినుంచి మొరుగుతూనే ఉన్నాడని అన్నాను. అలా చెప్పగానే అఫ్రిది సైలెంట్ అయిపోయాడని ఇర్ఫాన్ చెప్పాడు. తర్వాత ఏ సందర్భంలోనైనా అఫ్రిది తనతో వాగ్వాదం చేస్తే, 'ఇదిగో చూడు.. మళ్లీ అరుస్తున్నాడని కామెంట్ చేసేవాడినని ఇర్ఫాన్ వెల్లడించాడు. ఆ సంఘటన తర్వాత అఫ్రిది తనతో మాటల యుద్ధం పెట్టుకోవడానికి భయపడ్డాడని ఇర్ఫాన్ పేర్కొన్నాడు.