Loading...
Ravichandran Ashwin: ద్రవిడ్ తర్వాత అశ్విన్ పేరు.. ఇంగ్లండ్ కోచ్ రేసులో భారత స్పిన్ దిగ్గజం?
ద్రవిడ్ తర్వాత అశ్విన్ పేరు.. ఇంగ్లండ్ కోచ్ రేసులో భారత స్పిన్ దిగ్గజం?

Ravichandran Ashwin: ద్రవిడ్ తర్వాత అశ్విన్ పేరు.. ఇంగ్లండ్ కోచ్ రేసులో భారత స్పిన్ దిగ్గజం?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 16, 2026
12:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఇటీవల తమ టెస్టు జట్టు హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్‌ను పదవి నుంచి తప్పించింది. మెకల్లమ్ కోచ్‌గా, బెన్ స్టోక్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత 'బజ్‌బాల్' శైలితో ఇంగ్లండ్ టెస్టు క్రికెట్‌లో దూకుడు ప్రదర్శించినా, ఆ వ్యూహం ఆశించిన స్థాయిలో దీర్ఘకాలిక విజయాలను అందించలేకపోయింది. 'బజ్‌బాల్'కు బ్రేక్ ఆరంభంలో కొన్ని విజయాలు సాధించిన ఇంగ్లండ్.. తర్వాత వరుస వైఫల్యాలను ఎదుర్కొంది. ముఖ్యంగా యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో మరోసారి పరాజయం పాలవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పరిణామాల మధ్య కెప్టెన్ బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ ప్రకటించగా, అనంతరం మెకల్లమ్ కూడా కోచ్ పదవికి వీడ్కోలు పలికాడు.

వివరాలు

కోచ్ రేసులో ద్రవిడ్‌తో పాటు అశ్విన్ పేరు

కొత్త టెస్టు హెడ్ కోచ్ ఎంపికపై ఈసీబీ దృష్టి సారించగా, తొలుత భారత మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ పేరు ప్రధానంగా వినిపించింది.

అయితే తాజాగా భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ పేరు కూడా ఈ రేసులోకి రావడం ఆసక్తికరంగా మారింది.

అశ్విన్ ఆసక్తికర సమాధానం

ఈ అంశంపై ఓ ప్రముఖ క్రీడా జర్నలిస్టు అశ్విన్‌ను అతని యూట్యూబ్ ఛానెల్‌లోనే ప్రశ్నించాడు. "ఇంగ్లండ్ టెస్టు జట్టు కోచ్‌గా వెళ్తున్నారా?" అని అడగగా, అశ్విన్ నేరుగా సమాధానం చెప్పకుండా సరదాగా స్పందించాడు.

"ఈసీబీ సీఈవో రిచర్డ్ గుడ్‌తో చర్చలు జరుగుతున్నాయంటూ చిరునవ్వుతో వ్యంగ్యంగా బదులిచ్చాడు. దీంతో అతని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

వివరాలు

సీఎస్‌కే కోచ్‌గా కూడా అశ్విన్?

ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ కూడా హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌తో తమ ప్రయాణాన్ని ముగించింది. దీంతో సీఎస్‌కే కొత్త కోచ్ ఎవరన్న దానిపై చర్చలు జరుగుతున్నాయి.

ఈ జాబితాలో కూడా రాహుల్ ద్రవిడ్‌తో పాటు అశ్విన్ పేరు వినిపిస్తోంది. ఈ అంశాన్ని కూడా జర్నలిస్టు ప్రస్తావించగా, అశ్విన్ మరోసారి తెలివిగా సమాధానం దాటవేశాడు.

"నా యూట్యూబ్ ఛానెల్‌లో 'అశూ కి బాత్' కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు" అంటూ ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వకుండా సంభాషణను ముగించాడు.

ADVERTISEMENT

వివరాలు

అభిమానుల్లో ఆసక్తి

అశ్విన్ వరుసగా ప్రశ్నలను దాటవేయడంతో ఏదో విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నాడనే చర్చ అభిమానుల్లో మొదలైంది.

ఇంగ్లండ్ టెస్టు జట్టుకు కోచ్ కాకపోయినా, సీఎస్‌కే కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉండొచ్చని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్‌లో 2009లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అరంగేట్రం చేశాడు. 2010, 2011 సీజన్లలో సీఎస్‌కే వరుసగా టైటిళ్లు గెలవడంలో అతను కీలక పాత్ర పోషించాడు.

ఆ రెండు సీజన్లలో 28 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 33 వికెట్లు పడగొట్టాడు.

తర్వాత పలు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించిన అశ్విన్.. గత ఏడాది మళ్లీ సీఎస్‌కేలో చేరాడు. అయితే ఆశించిన స్థాయిలో రాణించలేక చివరకు ఐపీఎల్‌కు వీడ్కోలు పలికాడు.

ADVERTISEMENT