Page Loader
జపాన్‌ ఓపెన్‌ సూపర్‌ 750 టోర్నమెంట్‌ నుండి లక్ష్యసేన్ ఔట్ 
జపాన్‌ ఓపెన్‌ సూపర్‌ 750 టోర్నమెంట్‌ నుండి లక్ష్యసేన్ ఔట్

జపాన్‌ ఓపెన్‌ సూపర్‌ 750 టోర్నమెంట్‌ నుండి లక్ష్యసేన్ ఔట్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 29, 2023
02:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

జపాన్‌ ఓపెన్‌ సూపర్‌ 750 టోర్నమెంట్‌ నుంచి భారత స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ నిష్క్రమించాడు. పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్స్‌లో ఇండోనేషియా షట్లర్‌ జొనాథన్‌ క్రిస్టీ చేతిలో లక్ష్యసేన్‌ ఓడిపోయాడు. శనివారం జరిగిన మొదటి గేమ్‌లో పోటాపోటీగా తలపడిన వీరు గేమ్‌ ఆఖర్లో లక్ష్యసేన్ పట్టు సడలించడంతో 21-15 తేడాతో జొనాథన్‌ గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. జొనాథన్‌ పై రెండో గేమ్‌ను కసిగా మొదలుపెట్టిన లక్ష్యసేన్‌ పట్టు సాధించలేకపోయాడు. దాంతో 13-21 తేడాతో రెండో గేమ్‌ను జొనాథన్‌ కైవసం చేసుకున్నాడు. మూడో గేమ్‌లో భారత షట్లర్‌ లక్ష్యసేన్‌ ఏ మాత్రం పోటీనియ్యకపోవడంతో ఇండోనేషియా షట్లర్‌ జొనాథన్‌ 21-16 తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జపాన్‌ ఓపెన్‌ సూపర్‌ 750 టోర్నమెంట్‌ నుండి లక్ష్యసేన్ ఔట్