Loading...
Vaibhav Sooryavanshi: సచిన్ తర్వాత కోహ్లీ.. ఇప్పుడు వైభవ్.. శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు!
సచిన్ తర్వాత కోహ్లీ.. ఇప్పుడు వైభవ్.. శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు!

Vaibhav Sooryavanshi: సచిన్ తర్వాత కోహ్లీ.. ఇప్పుడు వైభవ్.. శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 27, 2026
04:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ రికార్డుల ద్విశతకంతో అదరగొట్టాడు. వన్డే మ్యాచ్‌ను సైతం టీ20 తరహాలో ఆడుతూ కేవలం 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ మార్కును అందుకున్నాడు. అతడి విధ్వంసకర బ్యాటింగ్‌పై మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసలు కురిపించారు. వైభవ్‌ను భవిష్యత్తులో అన్ని ఫార్మాట్లలో ఆడించాలని సూచించారు. ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపించే సత్తా అతడికి ఉందని పేర్కొన్నారు. వైభవ్ సూర్యవంశీ ఆల్‌ఫార్మాట్ ప్లేయర్. ఇప్పటికిప్పుడు టెస్టుల్లో ఆడించకూడదని భావిస్తే సరే.. కనీసం జట్టు స్క్వాడ్‌లోనైనా అవకాశం కల్పించాలి. శ్రీలంక జట్టు మన దేశ పర్యటనకు రాబోతోంది. వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో వైభవ్‌కు ఛాన్స్ ఇవ్వాలి.

వివరాలు

ఒక్క మ్యాచులోనైనా బరిలోకి దిగాలి

జట్టులోకి తీసుకుని కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా బరిలోకి దింపాలి.

వైభవ్‌ను మరింత వృద్ధిలోకి తీసుకురావాలని మీరు భావిస్తే.. వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ జట్టులో అతడికి చోటు కల్పించాలి. 15 మంది సభ్యుల స్క్వాడ్‌లో ఉంచాలి.

ఏదో ఒక రోజు అతడు ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపిస్తాడని శ్రీకాంత్ వెల్లడించారు.

వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌పై శ్రీకాంత్ మరింత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వివరాలు

సన్ ఆఫ్ ది గాడ్ ఆఫ్ క్రికెట్..

''వైభవ్ ఆటలో కేవలం పవర్ మాత్రమే కాదు.. అద్భుతమైన టైమింగ్ కూడా ఉంది. గొప్ప ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేస్తాడు.

షాట్ల ఎంపిక విషయంలో ఏమాత్రం తడబడినట్లు కనిపించడు. ఏం చేయాలి? ఎలా ఆడాలనే విషయాలపై అతడికి స్పష్టత ఉంది.

అద్భుతమైన ఆటగాడు. ముందు 'గాడ్ ఆఫ్ క్రికెట్' సచిన్ వచ్చాడు. ఆ తర్వాత కింగ్ కోహ్లీ.. ఇప్పుడు వైభవ్ 'సన్ ఆఫ్ ది గాడ్ ఆఫ్ క్రికెట్'. ఇలాంటి ఆటగాడిని ప్రోత్సహించకుండా.. అతడే తనంతట తానుగా ఎదుగుతాడని చెప్పడం సరైంది కాదు.

ఇలాంటి వైఖరితో నాణ్యమైన క్రికెటర్ భవిష్యత్తును నాశనం చేయొద్దు. టీమ్ మేనేజ్‌మెంట్, సెలక్టర్లు దయచేసి మేల్కొనాలి'' అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ సూచించారు.

ADVERTISEMENT