Smriti Mandhana: 'గ్లింప్‌సెస్ ఆఫ్ లైఫ్'.. కొత్త లుక్‌లో దర్శనమిచ్చిన స్మృతి మంధాన
ఈ వార్తాకథనం ఏంటి
భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. 'గ్లింప్సెస్ ఆఫ్ లైఫ్' అనే క్యాప్షన్‌తో ఆమె కొన్ని ఫొటోలను షేర్ చేయగా, అవి నెట్టింట వేగంగా వైరల్ అవుతున్నాయి. ఇటీవల తన వివాహ రద్దు విషయాన్ని వెల్లడించిన తర్వాత స్మృతి చేసిన ఈ ఫొటోషూట్ కావడం విశేషం. ఓ ప్రముఖ మొబైల్ బ్రాండ్ ప్రమోషన్‌లో భాగంగా ఈ చిత్రాలను ఆమె పంచుకోగా,నెటిజన్లు వాటిని విపరీతంగా మెచ్చుకుంటున్నారు. ఫొటోల్లో స్మృతి ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో కనిపించారని అభిమానులు కామెంట్లు చేస్తూ, ఎంతోమందికి ఆమె స్ఫూర్తిగా నిలుస్తున్నారని ప్రశంసిస్తున్నారు. ఇదిలా ఉండగా,ఇటీవల బెంగళూరులో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో కూడా స్మృతి మంధాన పాల్గొన్నారు.
వివరాలు
పలాశ్ ముచ్చల్‌తో వివాహం రద్దు
ఈఈవెంట్‌లో ఆమె తెల్లని గౌనులో మెరిసిపోయారు.ఆ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు సైతం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ వైరల్‌గా మారాయి. మరోవైపు,కెరీర్ పరంగా చూస్తే..ఈ నెలాఖరులో స్మృతి మళ్లీ క్రికెట్ మైదానంలో అడుగుపెట్టనున్నారు. శ్రీలంకతో జరగనున్నటీ20 సిరీస్‌లో ఆమె జట్టులో భాగం కానున్నారు. ఇటీవలే మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్‌తో తన వివాహం రద్దయినట్లు స్మృతిమంధాన అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. నవంబర్ 23న జరగాల్సిన ఈపెళ్లి అనుకోని కారణాల వల్ల ముందుగా వాయిదా పడింది. ఆ తరువాత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వివాహవేడుకలకు సంబంధించిన పోస్టులన్నింటినీ తొలగించిన స్మృతి,కొన్ని రోజులకే పెళ్లి రద్దు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈవ్యక్తిగత విషయంలో తన గోప్యతకు గౌరవం ఇవ్వాలని ఆమె అభిమానులను కోరారు.