Loading...
Suryakumar Yadav: టీమిండియాలోకి మళ్లీ రావడమే లక్ష్యం.. రీఎంట్రీపై సూర్యకుమార్‌ కీలక కామెంట్స్
టీమిండియాలోకి మళ్లీ రావడమే లక్ష్యం.. రీఎంట్రీపై సూర్యకుమార్‌ కీలక కామెంట్స్

Suryakumar Yadav: టీమిండియాలోకి మళ్లీ రావడమే లక్ష్యం.. రీఎంట్రీపై సూర్యకుమార్‌ కీలక కామెంట్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 28, 2026
12:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా మాజీ టీ20 కెప్టెన్‌, స్టార్ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ మరోసారి భారత టీ20 జట్టులో చోటు దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ పర్యటనలకు ఎంపిక కాకపోయినప్పటికీ.. అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రావడమే తన లక్ష్యమని సూర్య తాజాగా స్పష్టం చేశాడు. ఇందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నానని, అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని తెలిపాడు. తన అంతర్జాతీయ భవిష్యత్తుపై స్పందించిన సూర్యకుమార్‌ యాదవ్‌.. టీమిండియాలోకి తిరిగి వచ్చేందుకు తనవంతుగా చేయాల్సిన ప్రతిదీ చేస్తున్నానని చెప్పాడు. పరిస్థితులు అనుకూలిస్తే మిగతావన్నీ వాటంతట అవే సెట్‌ అవుతాయని పేర్కొన్నాడు. ప్రో గోవింద లీగ్‌ సందర్భంగా సూర్య ఈ వ్యాఖ్యలు చేశాడు. నేను చాలా కష్టపడుతున్నాని చెప్పారు.

వివరాలు

ఫామ్‌ లేమితో జట్టుకు దూరం

నా వంతుగా చేయాల్సిన ప్రతిదీ చేస్తున్నాను. పరిస్థితులు అనుకూలంగా ఉంటే అన్నీ వాటంతట అవే జరుగుతాయని సూర్యకుమార్‌ పేర్కొన్నాడు.

ఇటీవల బ్యాట్‌తో సూర్యకుమార్‌ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ముఖ్యంగా ఐపీఎల్‌లో అతడి ప్రదర్శన పెద్దగా ఆకట్టుకోలేదు.

దీంతో రాబోయే రెండేళ్ల కోసం టీమిండియా ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సెలెక్టర్లు.. యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ కారణంగానే సూర్యకుమార్‌ను ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ పర్యటనలకు ఎంపిక చేయలేదని సమాచారం. ఒకప్పుడు ప్రపంచ నంబర్‌-1 టీ20 బ్యాటర్‌గా నిలిచిన సూర్యకుమార్‌.. గత కొంతకాలంగా నిలకడైన ప్రదర్శన కోసం ఇబ్బంది పడుతున్నాడు.

రోహిత్‌ శర్మ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత సూర్యకుమార్‌ భారత టీ20 జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు.

వివరాలు

శ్రేయస్‌ అయ్యర్‌పైనా ఒత్తిడి

అతడి నాయకత్వంలోనే భారత్‌ ఈ ఏడాది మూడో టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ను గెలుచుకుంది.

అయితే ఆ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలను శ్రేయస్‌ అయ్యర్‌కు అప్పగించడంతో పాటు సూర్యకుమార్‌ను టీ20 జట్టు నుంచి పూర్తిగా తప్పించారు.

మరోవైపు శ్రేయస్‌ అయ్యర్‌ నాయకత్వంలోనూ టీమిండియా టీ20ల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది.

ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో భారత్‌ 2-0 తేడాతో ఓటమిపాలైంది. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 4-0తో పరాజయం ఎదురైంది.

అయితే జింబాబ్వేతో జరిగిన సిరీస్‌లో టీమిండియా పుంజుకుంది. ఆ సిరీస్‌ను భారత్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.

అయినప్పటికీ శ్రేయస్‌ అయ్యర్‌పై ఒత్తిడి కొనసాగుతోంది. రాబోయే మ్యాచ్‌ల్లో అతడు స్థిరంగా మంచి ఫలితాలు సాధించాల్సిన అవసరం ఉంది.

ADVERTISEMENT

వివరాలు

2028 ప్రపంచకప్‌, ఒలింపిక్స్‌పై దృష్టి

2028లో టీ20 ప్రపంచకప్‌తో పాటు ఒలింపిక్స్‌ కూడా జరగనున్న నేపథ్యంలో భారత జట్టు మేనేజ్‌మెంట్‌ దీర్ఘకాలిక ప్రణాళికలపై దృష్టి సారించింది.

ఈ నేపథ్యంలో శ్రేయస్‌ అయ్యర్‌ వరుసగా విఫలమైతే ప్రత్యామ్నాయ కెప్టెన్‌ కోసం టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆలోచించే అవకాశం ఉంది.

అదే సమయంలో సూర్యకుమార్‌ యాదవ్‌ తన పాత ఫామ్‌ను తిరిగి అందుకుంటే.. మరోసారి టీమిండియా టీ20 జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు ఉంటాయి.

దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం కోసం సూర్య చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

ADVERTISEMENT