Fastest Fifty: వరుసగా ఎనిమిది సిక్సులు.. ప్రపంచ రికార్డు సృష్టించిన ఆకాష్
ఈ వార్తాకథనం ఏంటి
మేఘాలయ క్రికెటర్ ఆకాష్ కుమార్ చౌదరి ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో వరల్డ్ రికార్డు సృష్టించారు. సూరత్‌లోని పితావాలా స్టేడియంలో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ మ్యాచ్లో ఆకాష్ కేవలం 11 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించారు. ఇది రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీగా గుర్తించబడింది. ఈ క్రమంలో 2012లో ఎసెక్స్ తరఫున లీసెస్టర్‌షైర్ కోసం ఆడిన 'వేన్ వైట్' 12 బంతుల రికార్డును ఆకాష్ కొత్త రికార్డు స్థాయికి తీసుకెళ్ళారు. అరుణాచల్ ప్రదేశ్ మ్యాచ్‌లో ఆకాష్ 14 బంతుల్లో 50 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఆయన వరుసగా ఎనిమిది సిక్స్‌లు కొట్టడం విశేషం.
Details
ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో మరో రికార్డు
ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టడం ద్వారా ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో మరో రికార్డు సృష్టించారు. 126వ ఓవర్‌లో 'లిమార్ డాబీ' బౌలింగ్‌పై ఆకాష్ ఆరు బంతుల్లోనూ సిక్స్‌లు కొట్టాడు. ఆ తర్వాత తాను ఎదుర్కొన్న రెండు బంతులలో కూడా సిక్స్‌లు సాధించాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో వరుసగా ఎనిమిది బంతుల్లో సిక్స్‌లు కొట్టిన తొలి క్రికెటర్‌గా ఆకాష్ చౌదరి పేరు చేరారు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టడం ఇది రెండోసారి. 1984-85లో తిలక్ రాజ్ బౌలింగ్‌లో రవిశాస్త్రి ఆరు సిక్సర్లు కొట్టాడు.
Details
ఆల్ రౌండర్ గా రాణిస్తున్న ఆకాష్
మొత్తం ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్డడం ఇది మూడోసారి. 25 ఏళ్ల ఆకాష్ ఇప్పటివరకు 31 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు, 28 లిస్ట్-ఎ మ్యాచ్‌లు, 30 టీ20 మ్యాచ్‌లు ఆడారు. ఆల్-రౌండర్‌గా ఆకాష్ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో మూడు హాఫ్ సెంచరీలు చేసి 553 పరుగులు సాధించారు. బౌలింగ్‌లో 87 వికెట్లు తీసారు. లిస్ట్-ఎ క్రికెట్‌లో 203 పరుగులు, 37 వికెట్లు, టీ20లో 107 పరుగులు, 28 వికెట్లు సాధించారు.