Loading...
Carlos Alankaraz : అల్కరాస్‌ మొదలెట్టాడు.. యూఎస్‌ ఓపెన్‌లో శుభారంభం
అల్కరాస్‌ మొదలెట్టాడు.. యూఎస్‌ ఓపెన్‌లో శుభారంభం

Carlos Alankaraz : అల్కరాస్‌ మొదలెట్టాడు.. యూఎస్‌ ఓపెన్‌లో శుభారంభం

వ్రాసిన వారు Moogati Shabari
Sep 02, 2026
09:39 am

ఈ వార్తాకథనం ఏంటి

టెన్నిస్‌ స్టార్‌ కార్లోస్‌ అల్కరాస్‌ అదరగొట్టాడు. గాయం కారణంగా సుమారు ఐదు నెలల పాటు ఆటకు దూరమైన అతడు.. యూఎస్‌ ఓపెన్‌లో విజయంతో పునరాగమనం చేశాడు. తొలి రౌండ్‌లో రష్యా ఆటగాడు రోమన్‌ సఫియులిన్‌పై వరుస సెట్లలో విజయం సాధించి రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. మహిళల సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్‌ ఇగా స్వైటెక్‌ కూడా ఘన విజయంతో టోర్నీని ప్రారంభించింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అల్కరాస్‌.. సుదీర్ఘ విరామం తర్వాత సింగిల్స్‌లో తొలి మ్యాచ్‌ ఆడాడు. మణికట్టు గాయంతో బాధపడిన అతడు చివరిసారిగా ఏప్రిల్‌లో సింగిల్స్‌ మ్యాచ్‌ ఆడాడు. అయితే సఫియులిన్‌తో జరిగిన పోరులో ఎలాంటి శారీరక ఇబ్బందులు ఎదురుకాలేదు. 6-4, 6-4, 6-4తో ప్రత్యర్థిని ఓడించి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు.

వివరాలు

28 సార్లు విజయం..

మ్యాచ్‌లో అల్కరాస్‌ రెండు ఏస్‌లు, 28 విన్నర్లు సాధించాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేశాడు.

''తిరిగి పోటీలోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. రానున్న మ్యాచ్‌ల్లో నా ఆట మరింత మెరుగవుతుంది.

పునరాగమనంలో తొలి మ్యాచ్‌ ఆడటం ఆనందంగా ఉంది'' అని మ్యాచ్‌ అనంతరం అల్కరాస్‌ చెప్పాడు.

ప్రపంచ నంబర్‌వన్‌ జానిక్‌ సినర్‌ గాయం కారణంగా టోర్నీకి దూరం కావడం, మాజీ ఛాంపియన్‌ నొవాక్‌ జకోవిచ్‌ తొలి రౌండ్‌లోనే ఓడిపోవడంతో అల్కరాస్‌పై అంచనాలు మరింత పెరిగాయి.

ఈ పరిస్థితుల్లో యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌కు అతడు ప్రధాన ఫేవరెట్‌గా నిలిచాడు.

వివరాలు

ఎవరెవరు గెలిచారంటే..

మరోవైపు మూడో సీడ్‌ ఫెలిక్స్‌ అగర్‌ అలియాసిమె, ఎనిమిదో సీడ్‌ బెన్‌ షెల్టన్‌ కూడా రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు.

అలియాసిమె 7-5, 4-6, 6-3, 7-5తో ఆస్ట్రేలియాకు చెందిన హిజికతను ఓడించాడు. షెల్టన్‌ 1-6, 6-1, 7-6 (7-3), 6-2తో ఫ్రాన్స్‌కు చెందిన గ్రీక్‌స్పూర్‌పై విజయం సాధించాడు.

గ్రీస్‌ ఆటగాడు స్టెఫానోస్‌ సిట్సిపాస్‌ 4-6, 7-6 (7-3), 6-1, 6-4తో ఫ్రాన్స్‌కు చెందిన ఆర్థర్‌ ఫిల్స్‌ను ఓడించాడు.

11వ సీడ్‌ ఫ్రాన్సిస్‌ తియోఫె 6-4, 4-6, 3-6, 6-3, 6-4తో తన దేశానికే చెందిన డామ్‌పై విజయం సాధించాడు.

ఇతర మ్యాచ్‌ల్లో ఇటలీ ఆటగాడు మాటియో బెరెటిని 7-6 (7-4), 7-6 (7-3), 6-0తో స్విట్జర్లాండ్‌కు చెందిన స్టాన్‌ వావ్రింకాను ఓడించాడు.

ADVERTISEMENT

వివరాలు

హోరా హోరీగా సాగిన మ్యాచ్..

అమెరికాకు చెందిన టీన్‌ 6-4, 6-1, 6-2తో పోర్చుగల్‌ ఆటగాడు నునో బోర్గ్స్‌పై, నకషిమ 6-2, 6-1, 6-0తో అర్జెంటీనా ఆటగాడు బేజ్‌పై గెలిచారు.

ఫ్రాన్స్‌కు చెందిన మనారినో 4-6, 3-6, 6-3, 6-3, 6-3తో అర్జెంటీనా ఆటగాడు టిరాంటెను ఓడించాడు.

చెకియా ఆటగాడు మెన్సిచ్‌ 6-1, 6-4, 7-5తో జపాన్‌కు చెందిన మొచిజుకిపై నెగ్గాడు.

హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్‌లో రష్యా ఆటగాడు ఆండ్రీ రుబ్లెవ్‌ అద్భుత పోరాటం చేశాడు.

తొలి రెండు సెట్లను కోల్పోయినప్పటికీ పుంజుకున్న అతడు.. ఫిన్లాండ్‌కు చెందిన విర్టానెన్‌ను 6-7 (5-7), 6-7 (0-7), 6-0, 6-2, 7-6 (10-5)తో ఓడించాడు.

రష్యా ఆటగాడు కచనోవ్‌ 6-3, 6-0, 6-1తో అర్జెంటీనాకు చెందిన బురుచగపై విజయం సాధించాడు.

ADVERTISEMENT