
IPL 2025: మూడూ జట్లు ప్లేఆఫ్స్ రేసు నుంచి ఔట్.. ప్లేఆఫ్స్ రేసులో ఏడు జట్లు సమర శంఖారావం!
ఈ వార్తాకథనం ఏంటి
ఇక ఐపీఎల్ 2025 కీలక దశలోకి ప్రవేశించింది. లీగ్ దశ ముగింపు దశకు చేరుకుంటుండగా, ప్లేఆఫ్స్ బెర్తుల కోసం జట్ల మధ్య పోటీ తారాస్థాయికి చేరింది.
ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ లాంటి ప్రముఖ జట్లు ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించాయి.
ఇప్పుడు మిగిలిన నాలుగు ప్లేఆఫ్స్ స్థానాల కోసం ఏడు జట్లు పోటీపడుతున్నాయి.
Details
ఒక్క గెలుపు దూరంలో ఆర్సీబీ, పంజాబ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఈ సీజన్‌ను దుమ్ముదులిపే ప్రదర్శనతో కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడి, 8 విజయాలతో టేబుల్ టాప్‌లో ఉంది.
కేవలం 3 ఓటములు మాత్రమే ఎదురైన ఆ జట్టు 16 పాయింట్లతో ముందంజలో ఉంది. మరో విజయం సాధిస్తే ఆర్సీబీకి ప్లేఆఫ్స్ టికెట్ ఖాయం. పంజాబ్ కింగ్స్ కూడా ఐపీఎల్ 18లో బలంగా పోటీపడుతోంది.
ఇప్పటివరకు 11 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించగా, 3 ఓటములు, ఒకటి వర్షం కారణంగా రద్దయ్యింది. ప్రస్తుతం జట్టు ఖాతాలో 15 పాయింట్లు ఉన్నాయి.
మరో గెలుపుతో పంజాబ్ కూడా ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టే అవకాశాన్ని అందుకుంటుంది.
Details
ముంబయి, గుజరాత్ సమాన స్థాయిలో
ముంబయి ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ 14 పాయింట్లతో సమానంగా నిలిచాయి. ముంబయి ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి 7 గెలిచింది, 4 ఓడింది.
ఇంకా 3 మ్యాచ్‌లు మిగిలి ఉండగా, వీటిలో కనీసం రెండింటిలో గెలిస్తే ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు బలంగా ఉంటాయి. ఒక్క గెలుపుతో కూడా అవకాశం లేకపోలేదు.
గుజరాత్ టైటాన్స్ 10 మ్యాచ్‌ల్లోనే 7 విజయాలు సాధించింది. ఇంకా నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉండటంతో ఆ జట్టుకు అవకాశాలు మరింత మెరుగ్గా కనిపిస్తున్నాయి.
నెట్ రన్ రేట్ పరంగా ముంబయి (+1.274), గుజరాత్ (+0.867) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Details
ఢిల్లీకి తేడా గెలుపే
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ ఆశలు ఇంకా కోల్పోలేదు. వర్షం కారణంగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్ రద్దవడంతో ఓటమి నుంచి తప్పించుకుంది.
ఇప్పటివరకు 11 మ్యాచ్‌లలో 6 గెలిచి, 4 ఓడింది. ఒకటి రద్దు కాగా, 13 పాయింట్లతో నిలిచింది.
మిగిలిన 3 మ్యాచ్‌ల్లో కనీసం 2 గెలిస్తే అవకాశాలు మెరుగవుతాయి. మూడు గెలిస్తే ప్లేఆఫ్స్ దాదాపుగా ఖాయం.
Details
కేకేఆర్, లక్నోకు కఠిన సమయం
కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్), లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్ చేరడం కోసం కష్టపడాల్సిన పరిస్థితి. ఇరు జట్లు 11 మ్యాచ్‌ల్లో 5 గెలిచి, 6 ఓడాయి.
కేకేఆర్‌కు వర్షం కారణంగా ఒక మ్యాచ్ రద్దయ్యింది. దీంతో ఆ జట్టు ఖాతాలో 11 పాయింట్లు, లక్నో ఖాతాలో 10 పాయింట్లు ఉన్నాయి.
ఇంకా మూడు మ్యాచ్‌ల చొప్పున ఆడాల్సిన ఈ రెండు జట్లు ప్లేఆఫ్స్‌కు చేరాలంటే మిగతా మ్యాచ్‌లన్నింటిలోనూ గెలవాల్సి ఉంటుంది.
అయినప్పటికీ ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది.