LOADING...
#viral Moment: ఒంటిచేత్తో అద్భుత క్యాచ్.. ఐపీఎల్ హిస్టరీలోనే బెస్ట్ క్యాచ్ పట్టిన ఫిలిప్ సాల్ట్
ఒంటిచేత్తో అద్భుత క్యాచ్.. ఐపీఎల్ హిస్టరీలోనే బెస్ట్ క్యాచ్ పట్టిన ఫిలిప్ సాల్ట్ (వీడియో)

#viral Moment: ఒంటిచేత్తో అద్భుత క్యాచ్.. ఐపీఎల్ హిస్టరీలోనే బెస్ట్ క్యాచ్ పట్టిన ఫిలిప్ సాల్ట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 28, 2026
10:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో SRH బ్యాటర్ ఇషాన్ కిషన్ 37 బంతుల్లో 80 పరుగులు చేసి విజృంభించాడు. అయితే ఆర్సీబీ ఆటగాడు ఫిలిప్ సాల్ట్ సూపర్ క్యాచ్ పట్టి ఇషాన్ కిషన్‌ను పెవిలియానికి పంపారు. సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించిన కిషన్‌ను బౌండరీ లైన్ వద్ద సాల్ట్ ఒంటిచేత్తో డైవ్ చేసి పట్టిన క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాలు

అద్భుత క్యాచ్ అంటూ కామెంట్లు

16వ ఓవర్ చివరి బంతిని కిషన్ బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో సిక్స్ కొట్టడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో బౌండరీ దగ్గర నిలబడి ఉన్న సాల్ట్, పరుగెత్తుతూ వచ్చి కుడి చేత్తో అద్భుతమైన క్యాచ్ పట్టాడు. దీంతో ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ముగిసింది. ఈ క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో

Advertisement