Page Loader
Amit Mishra: పెళ్లి కానీ భార‌త మాజీ క్రికెట‌ర్ పై గృహ‌హింస కేసు..
పెళ్లి కానీ భార‌త మాజీ క్రికెట‌ర్ పై గృహ‌హింస కేసు..

Amit Mishra: పెళ్లి కానీ భార‌త మాజీ క్రికెట‌ర్ పై గృహ‌హింస కేసు..

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 22, 2025
05:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

సోషల్ మీడియాలో వ‌దంతులకు కొద‌వ ఉండ‌డం లేదు. సెలబ్రిటీలు, క్రికెటర్లు ఇలా ఎవ్వరినీ వదలకుండా, వారి గురించి అసత్య కథనాలు ప్రచారం చేయడం కొంతమంది ఆకతాయిల అలవాటైపోయింది. తాజాగా, భారత మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా దీనికి బాధితుడయ్యాడు. ఆయన పేరు మీద తప్పుడు కేసు నమోదైనట్టుగా ప్రచారం జరిగింది. గృహ హింసకు పాల్పడుతున్నాడని, మిశ్రా తన భార్యకు శారీరకంగా, మానసికంగా హింసిచాడని వార్తలు విపరీతంగా వైరల్ అయ్యాయి. కానీ మిశ్రా మాత్రం ఈ విషయాన్ని ఖండిస్తూ, తాను అసలు పెళ్లే చేసుకోలేదని స్పష్టం చేశాడు. "పెళ్లే చేయని నాకు డొమెస్టిక్ వయొలెన్స్ ఎలా వర్తిస్తుంది?" అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు.

వివరాలు 

నేను పెళ్లి చేసుకోనేలేదు" మిశ్రా 

"నాపై వస్తున్నతప్పుడు కథనాలు చూసి చాలా బాధపడ్డాను. మీడియాపై నాకు గౌరవం ఉంది. కానీ ఈ విషయంలో వారు నిజాలను పరిశీలించకుండా ప్రచారం చేయడమంటే బాధాకరం. గృహ హింసకు సంబంధించిన కేసు ఏదైనా నిజంగా ఉండవచ్చు. కానీ నిజ‌మైన వ్య‌క్తి బ‌దులు నా ఫొటోను ఉపయోగించడం పెద్ద తప్పు. నేను పెళ్లి చేసుకోనేలేదు. అలాంటప్పుడు నా పేరు, ప్రతిష్ఠను ఎలా చెడగొడతారు?" అని మిశ్రా ప్రశ్నించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అమిత్ మిశ్రా చేసిన ట్వీట్ 

వివరాలు 

2015లో స్నేహితురాలిపై లైంగిక వేధింపులు 

"ఈ రకమైన నిరాధారమైన కథనాలు వ్యాపించడం వల్ల, సామాజికంగా నా గౌరవం దెబ్బతింటోంది. అందుకే మీకు ఒక్క విజ్ఞప్తి - దయచేసి ఈ రకమైన వదంతులను తక్షణమే ఆపేయండి," అని మిశ్రా మీడియా వర్గాలను కోరాడు. అయితే, మిశ్రా 2015లో తన స్నేహితురాలిపై లైంగిక వేధింపుల ఆరోపణలతో ఒక కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆయనపై ఐపీసీ సెక్షన్లు 354, 323, 324 కింద కేసు నమోదు అయింది. అనంతరం ఆయన బెయిల్‌పై విడుదలయ్యాడు.

వివరాలు 

అమిత్ మిశ్రా క్రికెట్ ప్రస్థానం: 

లెగ్ స్పిన్నర్‌గా పేరుగాంచిన అమిత్ మిశ్రా, 2003లో భారత జట్టులోకి ఎంపికయ్యాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. 2010లో టీ20 ఫార్మాట్‌లోనూ దేశం తరపున తన తొలి మ్యాచ్ ఆడాడు. మొత్తం 68 అంతర్జాతీయ మ్యాచ్‌లకు మిశ్రా ప్రాతినిధ్యం వహించాడు. 2017లో తన చివరి టీ20 మ్యాచ్ ఆడిన ఆయన, తర్వాత జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ఐపీఎల్ 17వ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడిన మిశ్రా, 18వ సీజన్‌కు మాత్రం స్వయంగా విరమించుకున్నాడు. కానీ ఇప్పటివరకు క్రికెట్‌కు అధికారికంగా గుడ్ బై చెప్పలేదు.