LOADING...
AUS vs ENG : యాషెస్‌లో ఆసీస్‌కు ఊహించని ఎదురుదెబ్బ.. స్టార్ ప్లేయర్ ఔట్, ఇంగ్లాండ్‌కు ఊరట?
యాషెస్‌లో ఆసీస్‌కు ఊహించని ఎదురుదెబ్బ.. స్టార్ ప్లేయర్ ఔట్, ఇంగ్లాండ్‌కు ఊరట?

AUS vs ENG : యాషెస్‌లో ఆసీస్‌కు ఊహించని ఎదురుదెబ్బ.. స్టార్ ప్లేయర్ ఔట్, ఇంగ్లాండ్‌కు ఊరట?

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 22, 2025
04:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా జట్టు ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ 2025-26ను కైవసం చేసుకుంది. ఇక మిగిలిన రెండు టెస్టుల్లోనూ విజయం సాధించి 5-0తో ఇంగ్లాండ్‌ను క్లీన్‌స్వీప్ చేయాలనే లక్ష్యంతో ఆసీస్ దూసుకెళ్తోంది. అయితే ఈ గెలుపు జోష్‌లో ఉన్న ఆస్ట్రేలియా జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక స్పిన్నర్ నాథన్ లియోన్ చివరి రెండు టెస్టులకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Details

అడిలైడ్ టెస్టులో గాయం

అడిలైడ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టు చివరి రోజు ఫీల్డింగ్ చేస్తుండగా లియోన్ గాయపడ్డాడు. బంతిని ఆపే క్రమంలో డైవ్ చేసిన తర్వాత అతడి తొడ కండరాలు పట్టేయడంతో తీవ్ర నొప్పితో విలవిల్లాడాడు. వెంటనే ఫిజియో మైదానంలోకి వచ్చి ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ ఫలితం కనిపించలేదు. దీంతో ఫిజియో సాయంతోనే లియోన్ మైదానం వీడాల్సి వచ్చింది. మ్యాచ్ అనంతరం ఆయన ఊత కర్రల సాయంతో నడుచుకుంటూ కనిపించడంతో గాయం తీవ్రతపై ఆందోళన వ్యక్తమైంది.

Details

రిహాబిలిటేషన్ సెంటర్‌కు లియోన్

38 ఏళ్ల నాథన్ లియోన్ గాయంపై ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ స్పందించాడు. ఇది నిజంగా చాలా బాధాకరమని పేర్కొన్నాడు. మూడో టెస్టు విజయానికి లియోన్ కీలక పాత్ర పోషించాడని, అతడికి తప్పకుండా క్రెడిట్ ఇవ్వాలని అన్నాడు. లియోన్‌ను త్వరలోనే రిహాబిలిటేషన్ సెంటర్‌కు పంపనున్నట్లు స్టార్క్ వెల్లడించాడు. 'గతంలో పిక్క గాయంతో బాధపడినప్పుడు కూడా లియోన్ రిహాబిలిటేషన్‌లో కోలుకున్నాడు. ఇప్పుడు కూడా అతడు తప్పకుండా త్వరగా కోలుకుంటాడని నమ్ముతున్నాను. ఆసీస్ జట్టుకు ఇంకా కొంతకాలం సేవలందించాలనే అతడి తపన స్పష్టంగా కనిపిస్తోంది. త్వరలోనే అతడు మళ్లీ మైదానంలో అడుగుపెట్టాలని కోరుకుంటున్నానని స్టార్క్ వ్యాఖ్యానించాడు. అడిలైడ్ టెస్టులో నాథన్ లియోన్ 5 వికెట్లు** తీసి ఆస్ట్రేలియా విజయంలో తనవంతు కీలక పాత్ర పోషించాడు.

Advertisement