FIFA: 'ఎన్నటికీ మర్చిపోలేని ఫైనల్'.. స్పెయిన్ విజయంపై మోహన్‌లాల్ ఎమోషనల్ పోస్ట్!
ఈ వార్తాకథనం ఏంటి
ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్లో అర్జెంటీనాపై విజయం సాధించిన స్పెయిన్ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. ఈ చారిత్రాత్మక పోరును స్టేడియంలో ప్రత్యక్షంగా వీక్షించిన ప్రముఖ నటుడు మోహన్ లాల్‌త మ్యాచ్ అనంతరం సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని, భావోద్వేగాన్ని అభిమానులతో పంచుకున్నారు. తన పోస్టులో మోహన్‌లాల్ మాట్లాడుతూ.. స్టేడియంలో కూర్చుని ఈ ఫైనల్‌ను ప్రత్యక్షంగా వీక్షించడం నాకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చింది. జీవితాంతం గుర్తుండిపోయే మ్యాచ్ ఇది. స్పెయిన్, అర్జెంటీనా జట్లు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాయి. టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన స్పెయిన్‌కు హృదయపూర్వక అభినందనలని పేర్కొన్నారు.
వివరాలు
మోహన్‌లాల్‌కు క్రీడలంటే ప్రత్యేకమైన అభిమానం
అంతేకాకుండా.. శత్రుత్వాలు, దేశాల మధ్య సరిహద్దులు అన్నింటినీ మరిపించి ప్రపంచ ప్రజలను ఒక్కటిగా కలిపే శక్తి ఫుట్‌బాల్‌కు మాత్రమే ఉందని ఈ టోర్నీ మరోసారి నిరూపించింది.
అలాంటి గొప్ప ఆటకు ధన్యవాదాలంటూ తన సందేశాన్ని ముగించారు. మోహన్‌లాల్‌కు క్రీడలంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది.
ముఖ్యంగా అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సికి ఆయన వీరాభిమాని. ఈ ప్రపంచకప్‌లో అర్జెంటీనా ఆడిన దాదాపు అన్ని మ్యాచ్‌లను ఆయన స్టేడియంలోనే ప్రత్యక్షంగా వీక్షించడం విశేషం.
వివరాలు
ఫుట్‌బాల్ ఫైనల్‌లో సందడి చేసిన సినీ ప్రముఖులు
మోహన్‌లాల్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌ను ప్రత్యక్షంగా ఆస్వాదించారు.
హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్, ప్రముఖ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ స్టేడియంలో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు.
ఇక బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ కూడా సోషల్ మీడియాలో స్పందిస్తూ స్పెయిన్‌కు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా మైదానంలో యువ సంచలనం లామిన్ యమాల్ వెళ్లి లియోనెల్ మెస్సిని ఆప్యాయంగా హత్తుకున్న ఫొటోను ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకోవడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది.