AnahatSingh:అనాహత్ చారిత్రాత్మక విజయం దేశానికి గర్వకారణం.. ప్రధాని మోదీ ప్రశంసలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌గా నిలిచిన భారత యువ సంచలనం అనాహత్ సింగ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ప్రత్యేక సందేశం పోస్టు చేస్తూ ఆమె విజయాన్ని కొనియాడారు. అనాహత్ సింగ్ సాధించిన ఈ ఘనత దేశానికి గర్వకారణమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత స్క్వాష్ చరిత్రలో ఈ విజయం ఓ మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు. అలాగే కొత్తతరం క్రీడాకారులకు ఆమె విజయం స్ఫూర్తిదాయకమని, యువతలో స్క్వాష్ క్రీడపై మరింత ఆసక్తిని పెంచుతుందని తన సందేశంలో వెల్లడించారు
వివరాలు
తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు
ప్రపంచ జూనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా అనాహత్ సింగ్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 20వ స్థానంలో ఉన్న ఆమె ఫైనల్లో ఈజిప్ట్‌కు చెందిన రుకాయ సాలెమ్‌ను ఓడించి విజేతగా నిలిచారు.
18 ఏళ్ల అనాహత్‌కు ప్రపంచ జూనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో ఇది వరుసగా రెండో పతకం.
గత ఏడాది కాంస్య పతకాన్ని సాధించిన ఆమె, ఈసారి అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుని భారత స్క్వాష్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించారు.