Page Loader
హోరాహోరీ పోరులో మాటియో బెరెట్టినిపై ఆండ్రీ ముర్రే విజయం
బెరెట్టినిపై విజయం సాధించిన ముర్రే

హోరాహోరీ పోరులో మాటియో బెరెట్టినిపై ఆండ్రీ ముర్రే విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 17, 2023
05:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

మూడుసార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్, ఆండీ ముర్రే తొలి రౌండ్‌ను అతి కష్టం మీద అధిగమించాడు. 2023 ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రారంభ రౌండ్‌లో (13వ సీడ్) మాటియో బెరెట్టినిని ఓడించాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ లో ముర్రే.. ఇటలీకి చెందిన మాటియో బెరెట్టినీని 6-3, 6-3, 4-6, 6-7(7), 7-6(10-5) తేడాతో ఓడించి సత్తా చాటాడు. దాదాపు మ్యాచ్ 4 గంటల 49 నిమిషాల పాటు హోరాహోరీగా జరిగింది. ముర్రే మొత్తం 166 పాయింట్లను గెలుచుకున్నాడు, ఈ మ్యాచ్‌లో బెర్రెట్టిని 31 ఏస్‌లు కొట్టాడు, ముర్రే 10తో స్థిరపడ్డాడు. ముర్రే తన మొదటి, రెండవ సర్వ్‌లో వరుసగా 72, 67 విజయ శాతాన్ని నమోదు చేశాడు.

ఆండ్రీ ముర్రే

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 50వ విజయం

ఓపెన్ ఎరాలో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 50 విజయాలను పూర్తి చేసిన ఐదవ ఆటగాడిగా ముర్రే నిలిచాడు. ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్‌లో 50-14తో గెలుపు-ఓటమి రికార్డును కలిగి ఉన్నాడు. ముర్రే వరుసగా రెండో ఏడాది మెల్‌బోర్న్‌లో రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. అతను ఐదుసార్లు (2010-11, 2013, 2015-16) ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్స్‌కు చేరుకోవడం గమనార్హం. ముర్రే మొదటి రెండు సెట్లు గెలిచిన తర్వాత ఒక గ్రాండ్ స్లామ్ మ్యాచ్‌లో విజయాల పరంపరను కొనసాగించాడు. ముర్రే చివరిసారిగా 2005లో (వింబుల్డన్‌లో డేవిడ్ నల్బాండియన్‌పై) ఓడిపోయాడు. ముర్రే గత ఐదు ప్రధాన మ్యాచ్‌లలో నాలుగు గెలిచి సత్తా చాటాడు.