Loading...
Junior Asia Cup Hockey: జూనియర్ ఆసియాకప్‌లో భారత్‌ జోరు.. సెమీస్‌కు దూసుకెళ్లిన యువ హాకీ జట్టు
జూనియర్ ఆసియాకప్‌లో భారత్‌ జోరు.. సెమీస్‌కు దూసుకెళ్లిన యువ హాకీ జట్టు

Junior Asia Cup Hockey: జూనియర్ ఆసియాకప్‌లో భారత్‌ జోరు.. సెమీస్‌కు దూసుకెళ్లిన యువ హాకీ జట్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 10, 2026
11:02 am

ఈ వార్తాకథనం ఏంటి

జూనియర్‌ ఆసియాకప్‌ హాకీ టోర్నమెంట్‌లో భారత పురుషుల జట్టు అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌ దిశగా దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో చైనీస్‌ తైపీని భారత్‌ ఏకంగా 15-0తో చిత్తుగా ఓడించింది. కెప్టెన్‌ అన్మోల్‌ ఎక్కా ఆరు గోల్స్‌తో జట్టు భారీ విజయానికి ప్రధాన కారణంగా నిలిచాడు. మ్యాచ్‌ ఆరంభం నుంచే భారత ఆటగాళ్లు దూకుడుగా వ్యవహరించారు. వరుస దాడులతో చైనీస్‌ తైపీ రక్షణ శ్రేణిపై ఒత్తిడి పెంచారు. దీంతో ప్రత్యర్థి డిఫెన్స్‌ పూర్తిగా తడబడింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి భారత్‌ 6-0 ఆధిక్యంలో నిలిచింది. విరామం తర్వాత కూడా భారత జట్టు అదే దూకుడును కొనసాగించింది.

వివరాలు 

ఆరు గోల్స్‌ సాధించిన అన్మోల్

రెండో అర్ధభాగంలోనూ వరుసగా గోల్స్‌ సాధిస్తూ తైపీని కోలుకోనివ్వలేదు.

కెప్టెన్‌ అన్మోల్‌ ఎక్కా తన ఖాతాలో ఆరు గోల్స్‌ నమోదు చేశాడు. 25వ,29వ,32వ,33వ,45వ,51వ నిమిషాల్లో అతడు గోల్స్‌ కొట్టాడు.

విశేషమేమిటంటే.. అన్మోల్‌ సాధించిన ఆరు గోల్స్‌ కూడా పెనాల్టీ కార్నర్‌ల నుంచే వచ్చాయి.

ఆర్యన్‌ కూడా అద్భుత ఆటతీరుతో మూడు గోల్స్‌ సాధించాడు. 17వ,52వ,53వ నిమిషాల్లో అతడు బంతిని ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌లోకి పంపాడు.

హర్‌పాల్‌ రెండు గోల్స్‌ నమోదు చేశాడు. అతడు 48వ, 53వ నిమిషాల్లో గోల్స్‌ కొట్టాడు.

ప్రభ్‌దీప్‌ 18వ నిమిషంలో,గుర్‌సేవక్‌ 22వ నిమిషంలో, అర్జున్‌ సంతోష్‌ 28వ నిమిషంలో, అజీత్‌ యాదవ్‌ 35వ నిమిషంలో ఒక్కో గోల్‌ చేశారు.

ఈ విజయంతో భారత్‌ గ్రూప్‌-ఎలో తన ప్రస్థానాన్ని అగ్రస్థానంతో ముగించింది.

వివరాలు 

క్వార్టర్‌ఫైనల్లో పాకిస్థాన్‌తో భారత్‌ పోరు

నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, ఒక డ్రాతో మొత్తం 10పాయింట్లు సాధించింది.

దీంతో గ్రూప్‌లో టాప్‌ స్థానాన్ని ఖరారు చేసుకుంది. కొరియా 9పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత పొందింది.

తన చివరి మ్యాచ్‌లో కొరియా 3-2తో జపాన్‌ను ఓడించింది. జూనియర్‌ ఆసియాకప్‌లో భారత జట్టుకు మరో కీలక సమరం ఎదురుకానుంది.

గురువారం జరిగే క్వార్టర్‌ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్‌ తలపడనుంది.

ఈ మ్యాచ్‌లో విజయం సాధించి టోర్నీలో ముందుకు సాగాలని భారత యువ ఆటగాళ్లు పట్టుదలగా ఉన్నారు.

అంతకుముందు బుధవారం జరిగిన ఎలైట్‌ పూల్‌ చివరి మ్యాచ్‌లో భారత్‌,చైనా జట్లు 0-0తో డ్రా చేసుకున్నాయి.

ఇరు జట్లకు గోల్స్‌ చేసే అవకాశాలు లభించినప్పటికీ.. వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాయి.

ADVERTISEMENT

వివరాలు 

క్వార్టర్‌ఫైనల్లో పాకిస్థాన్‌తో భారత్‌ పోరు

మ్యాచ్‌ ఏడో నిమిషంలో చైనాకు పెనాల్టీ స్ట్రోక్‌ లభించింది. అయితే ఆ అవకాశాన్ని గోల్‌గా మలచడంలో చైనా ఆటగాడు విఫలమయ్యాడు.

భారత గోల్‌కీపర్‌ నిధి అద్భుతంగా స్పందించి ఆ షాట్‌ను అడ్డుకుంది.

అనంతరం జరిగిన మూడు క్వార్టర్లలో భారత్‌, చైనా జట్లకు లభించిన పెనాల్టీ కార్నర్‌ అవకాశాలు కూడా గోల్స్‌గా మారలేదు.

ఎలైట్‌ పూల్‌లో భారత్‌ నాలుగు మ్యాచ్‌లు ఆడి మూడు విజయాలు, ఒక డ్రాతో 10 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది.

చైనా కూడా 10 పాయింట్లు సాధించినప్పటికీ.. గోల్‌ వ్యత్యాసం కారణంగా రెండో స్థానానికి పరిమితమైంది.

ADVERTISEMENT