LOADING...
Jacob Bethell: టీమిండియాకు మరో విదేశీ అల్లుడు..? భారతీయ యువతితో ప్రేమలో ఇంగ్లండ్ స్టార్ జాకబ్ బెథెల్!
టీమిండియాకు మరో విదేశీ అల్లుడు..? భారతీయ యువతితో ప్రేమలో ఇంగ్లండ్ స్టార్ జాకబ్ బెథెల్!

Jacob Bethell: టీమిండియాకు మరో విదేశీ అల్లుడు..? భారతీయ యువతితో ప్రేమలో ఇంగ్లండ్ స్టార్ జాకబ్ బెథెల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 22, 2026
09:06 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్ క్రికెటర్ జాకబ్ బెథెల్ (Jacob Bethell) తన ఆటతో పాటు ఇప్పుడు వ్యక్తిగత జీవితంతోనూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ ఆల్‌రౌండర్ ఓ భారతీయ యువతితో రహస్యంగా ప్రేమలో ఉన్నాడంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి తోడు ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ ఫొటో ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చింది. తాజాగా వైరల్ అవుతున్న ఆ ఫొటోలో జాకబ్ బెథెల్ ఓ యువతిని కౌగిలించుకుని రొమాంటిక్‌గా పోజు ఇస్తూ కనిపించాడు. అయితే ఆ యువతి ముఖం స్పష్టంగా కనిపించకుండా జాగ్రత్త పడటంతో ఆమె ఎవరనే దానిపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. దీంతో జాకబ్ మనసు దోచుకున్న ఆ మిస్టరీ గర్ల్ ఎవరనే విషయంపై అభిమానులు ఆరా తీయడం ప్రారంభించారు.

వివరాలు

ప్రచారంలో అంకీతా పటేల్ పేరు

సోషల్ మీడియా వినియోగదారుల విశ్లేషణ ప్రకారం, ఆ ఫొటోలో కనిపించిన యువతి ముంబైకి చెందిన ప్రముఖ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ అంకితా పటేల్ అనే ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్‌లో మంచి గుర్తింపు సంపాదించిన అంకితా పటేల్ గతంలో శిల్పా శెట్టి, పలక్ తివారీ, హినా ఖాన్ వంటి ప్రముఖ సెలబ్రిటీలతో కలిసి పనిచేసింది. జాకబ్ బెథెల్ ఆమెతో ప్రేమలో ఉన్నాడంటూ నెటిజన్లు పెద్దఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ కథలో మరో ట్విస్ట్ కూడా ఉంది. అంకితా పటేల్ పేరుతో పాటు భారతీయ యువనటి ఆధ్యా ఆనంద్ పేరు కూడా ప్రస్తుతం బలంగా వినిపిస్తోంది. ఐపీఎల్ సమయంలో జాకబ్ బెథెల్, ఆధ్యా ఆనంద్ ఒకరికొకరు దగ్గరయ్యారని కొందరు సోషల్ మీడియా వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు.

వివరాలు

ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు

ఈ వాదనలకు బలం చేకూర్చేలా ఆధ్యా ఆనంద్ సోషల్ మీడియాలో చేసే దాదాపు ప్రతి పోస్టుకు జాకబ్ బెథెల్ లైక్ చేస్తూ వస్తున్నాడని అభిమానులు స్క్రీన్‌షాట్లతో సహా పంచుకుంటున్నారు. దీంతో ఒకవైపు మేకప్ ఆర్టిస్ట్ అంకితా పటేల్, మరోవైపు నటి ఆధ్యా ఆనంద్... ఈ ఇద్దరిలో జాకబ్ బెథెల్ హృదయాన్ని గెలుచుకున్నది ఎవరు అనే చర్చ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ప్రేమ పుకార్లపై ఇప్పటివరకు జాకబ్ బెథెల్ కానీ, అంకితా పటేల్ కానీ, ఆధ్యా ఆనంద్ కానీ అధికారికంగా స్పందించలేదు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే విషయం ఇంకా స్పష్టత రాలేదు

Advertisement