తదుపరి వార్తా కథనం
PV Sindhu: పీవీ సింధుకు మరో గౌరవం.. బీడబ్ల్యూఎఫ్ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Dec 26, 2025
09:25 am
ఈ వార్తాకథనం ఏంటి
రెండుసార్లు ఒలింపిక్ పతకాలు సాధించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి.సింధు మరో కీలక బాధ్యతను అందుకుంది. బీడబ్ల్యూఎఫ్(బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్)అథ్లెట్ల కమిషన్ ఛైర్‌పర్సన్‌గా 2026-29 కాలానికి ఆమె ఎన్నికైంది. ఈ పదవితో పాటు బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్ సభ్యురాలిగా కూడా సింధు కొనసాగనుంది. ఈ సందర్భంగా సింధు స్పందిస్తూ.. 'ఈ కొత్త బాధ్యతలను ఎంతో బాధ్యతతో స్వీకరిస్తున్నాను. అథ్లెట్ల కమిషన్ ఛైర్‌పర్సన్‌గా అథ్లెట్ల తరఫున బలంగా నిలబడతాను. అథ్లెట్లు, పాలకుల మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలిపింది. ఇదిలా ఉండగా, పీవీ సింధు 2020 నుంచి బీడబ్ల్యూఎఫ్ ఇంటిగ్రిటీ అంబాసిడర్‌గా కూడా సేవలందిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ఆటగాళ్ల హక్కులు, నైతిక విలువల పరిరక్షణలో ఆమె పాత్ర మరింత బలోపేతం కానుందని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.