Loading...
ISSF Shooting: ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌లో భారత్‌కు మరో పతకం.. సోనమ్‌-హిమాంశు జోడీ కాంస్యం
ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌లో భారత్‌కు మరో పతకం.. సోనమ్‌-హిమాంశు జోడీ కాంస్యం

ISSF Shooting: ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌లో భారత్‌కు మరో పతకం.. సోనమ్‌-హిమాంశు జోడీ కాంస్యం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 29, 2026
09:53 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో భారత్‌ పతకాల వేట కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు కూడా భారత షూటర్లు పతకాలు సాధించి సత్తా చాటారు. సోమవారం 25 మీటర్ల పిస్టల్‌ విభాగంలో ఇషా సింగ్‌ స్వర్ణం, మను బాకర్‌ కాంస్య పతకాలు గెలుచుకోగా.. మంగళవారం 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో సోనమ్‌ ఉత్తమ్‌ మస్కర్‌, హిమాంశు ధిల్లాన్‌ జోడీ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. కాంస్య పతక పోరులో సోనమ్‌, హిమాంశు ఇద్దరూ తలో 220.6 పాయింట్లు నమోదు చేశారు. దీంతో ఈ జోడీ మొత్తం 441.2 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి భారత్‌కు మరో పతకాన్ని అందించింది.

వివరాలు

నాలుగు పతకాలు కైవసం

ఈ విభాగంలో చైనా షూటర్లు ఆధిపత్యం చెలాయించారు. చైనా జట్లు స్వర్ణం, రజత పతకాలను కైవసం చేసుకున్నాయి. మరో భారత జోడీ ఇలవేనిల్‌, పార్థ్‌ ఆశించిన ఫలితం సాధించలేకపోయింది.

ఇలవేనిల్‌ 190.5, పార్థ్‌ 188.3 పాయింట్లు నమోదు చేయడంతో మొత్తం 378.8 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచారు.

ఇప్పటివరకు ఈ టోర్నీలో భారత్‌ మొత్తం ఒక స్వర్ణం, ఒక రజతం, రెండు కాంస్య పతకాలు సాధించి తన ఖాతాలో నాలుగు పతకాలను నమోదు చేసింది.

ADVERTISEMENT