జకోవిచ్‌కు మరో షాక్.. నిబంధనలు ఉల్లంఘించినందుకు భారీ జరిమానా
వింబుల్డన్‌లో పరాజయం పాలైన నొవాక్ జొకోవిచ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఈ గ్రాండ్‌స్లామ్‌లో స్పెయిన్ కుర్రాడు కార్లోస్ అల్కరాజ్ చేతిలో ఓడిన జకోవిచ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు భారీ జరిమానా పడింది. ఈ ఫైనల్ మ్యాచులో జకొవిచ్ భావోద్వేగాలను నియంత్రించుకోలేక తన టెన్నిస్ రాకెట్ ను విరగ్గొట్టాడు. ఐదో సెట్‌లో భాగంగా అల్కరాజ్ సర్వీస్ బ్రేక్ చేసిన జొకోవిచ్ కాసేపటికే తన సర్వీస్ ను కోల్పోయాడు. దీంతో ఆగ్రహంతో రాకెట్ ను నెట్ పోస్ట్ కు బలంగా కొట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
6.5లక్షలు జరిమానా విధించిన అంపైర్లు
రాకెట్‌ను విరగొట్టినందుకు జకోవిచ్ కు జరిమానా విధిస్తున్నామని ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ క్లబ్ వెల్లడించింది. దాదాపుగా 6.5లక్షలు ఫైన్ పడింది. 2023లో జకోవిచ్ కు ఇదే అత్యధిక జరిమానా కావడం గమనార్హం. జరిమానాను జకోవిచ్ రన్నరప్ గా అందుకున్న ప్రైజ్ మనీ నుంచి తీసుకోనున్నారు. రన్నరప్‌గా నిలిచిన జకోకు రూ.18 కోట్ల ప్రైజ్‌మనీ లభించింది. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌తో జకో 23వ గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో మాజీ వరల్డ్ నంబర్ 1 రఫెల్ నాదల్ (22 గ్రాండ్‌స్లామ్స్) రికార్డును అతను బద్ధలు కొట్టాడు.