Page Loader
జకోవిచ్ ను మట్టికరిపించిన అల్కరాజ్
విజేతగా నిలిచిన కార్లోస్ అల్కరాజ్

జకోవిచ్ ను మట్టికరిపించిన అల్కరాజ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 18, 2023
12:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెన్స్ సింగిల్స్ టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ జోరుకు బ్రేకు పడింది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ గెలిచి, వింబుల్డన్ ను గెలవాలనుకున్న జకోవిచ్ ఆశలు నెరవేరలేదు. స్పెయిన్ యువ కెరటం కార్లోస్ అల్కరాజ్ చేతిలో అతనికి ఓటమి ఎదురైంది. లండన్ వేదికగా ఆదివారం జరిగిన వింబుల్డర్ ఫైనల్ మ్యాచులో అల్కరాజ్ విజేతగా నిలిచాడు. తొలుత కాస్త తడబడ్డా అల్కరాజ్ తర్వాత జకోవిచ్ కు దిమ్మతిరిగే షాకిచ్చాడు. 1-6, 7-6(8/6), 6-1, 3-6, 6-4తో సెర్బియా దిగ్గజం జకోవిచ్‌ను అల్కరాజ్ మట్టికరిపించాడు. 2018లో జోకోవిచ్ చివరిసారిగా యూఎస్ ఓపెన్‌లో నెగ్గిన విషయం తెలిసిందే

Details

యూఎస్ ఓపెన్ లో మళ్లీ తలపడనున్న జకోవిచ్, అల్కరాజ్

వింబుల్డన్ విజేతగా నిలిచిన అల్కరాజ్‌కు రూ.25.29 కోట్లు, రన్నరప్‌గా నిలిచిన జొకోవిచ్‌కు రూ.12.64 కోట్లు ప్రైజ్ మనీ లభించింది. తదుపరి జరిగే యూఎస్ ఓపెన్‌లో జకోవిచ్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంది. కానీ, ఆ టోర్నమెంట్‌లో అతను డిఫెండింగ్ ఛాంపియన్ అల్కరాజ్‌తోనే పోటీపడనున్నాడు. దీంతో టెన్నిస్ అభిమానుల్లో అప్పుడే ఆసక్తి పెరిగిపోయింది. తాజాగా వింబుల్డన్ విజేతగా నిలిచిన కార్లోస్ అల్కరాజ్ పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది.