
Virat Kohli-Anushka Sharma: కోహ్లీ రిటైర్మెంట్‌పై ఇన్‌స్టాలో అనుష్క శర్మ స్టోరీ వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
టెస్టు క్రికెట్‌లో తన సుదీర్ఘ ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.
ఈ ఫార్మాట్‌లో ఎన్నో మరపురాని క్షణాలను సృష్టించిన 'కింగ్' విరాట్ కోహ్లీ, రెండు రోజుల క్రితం తన రిటైర్మెంట్‌ను ప్రకటించారు.
ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ మరోసారి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ స్టోరీని పోస్ట్ చేశారు.
ఈ కష్టతరమైన ఫార్మాట్‌లో తన భర్త ఎలా విజయం సాధించాడో ఆమె తెలిపింది.
''కథను అందంగా చెప్పగలిగే వారు టెస్టు క్రికెట్‌లో విజయం సాధిస్తారు.ఆ కథ చాలా సుదీర్ఘమైనది, లోతైనది.పిచ్ పరిస్థితి ఎలా ఉంది?ఎండిపోయిందా? పచ్చిగా ఉందా?స్వదేశమైనా,విదేశమైనా అని పట్టించుకోకుండా ఆ కథను చెప్పేవారు గెలుస్తారు'' అని అనుష్క తన ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్నారు.
వివరాలు
టెస్టు క్రికెట్ మాత్రం ఒక సాహిత్య నవల లాంటిది
ఇది వాస్తవానికి ఓ స్టాండప్ కమెడియన్ పోస్ట్ చేశారు.కోహ్లీకి అంకితమిస్తూ కమెడియన్ వరుణ్ గ్రోవర్ ఓ కవిత రాశారు.
''టెస్టు క్రికెట్ అనేది ఓ వర్ణనాత్మక,కవితాత్మక ఆట. అందుకే ఇది చాలా ప్రత్యేకం.ఐదు రోజులు, నాలుగు ఇన్నింగ్స్‌లు, 22మంది స్పెషలిస్ట్‌లు ఆడే ఆట. ఒక్కోసారి ఆడుతుండగానే వాతావరణంలో మార్పులు వస్తాయి. పిచ్ కండిషన్లు మారుతాయి. టాస్ అదృష్టం కీలకం అవుతుంది. వీటన్నింటితో పాటు మానసికంగా ఎన్నో లెక్కలు కూడా అవసరం. ప్రతి క్రీడ మన జీవితాన్ని కొంత మేర ప్రతిబింబించినప్పటికీ, టెస్టు క్రికెట్ మాత్రం ఒక సాహిత్య నవల లాంటిది. అనేక అంశాల మేళవింపు లాంటిది.అందుకే ఆ నవలలోని కథను అందంగా చెప్పేవారే టెస్టు క్రికెట్‌లో విజయం సాధిస్తారు'' అని వరుణ్ రాశారు.
వివరాలు
సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన స్టోరీ
ఈ విషయాలను అనుష్క తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన స్టోరీ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన రోజు కూడా అనుష్క భావోద్వేగానికి గురయ్యారు.
''అందరూ రికార్డులు, మైలురాళ్ల గురించి మాట్లాడతారు. నాకు మాత్రం నువ్వు ఎప్పుడూ చూపించని కన్నీళ్లు, ఎవరూ చూడని యుద్ధాలు, సుదీర్ఘ ఫార్మాట్‌పై అచంచలమైన ప్రేమ గుర్తుండిపోతాయి. ప్రతి టెస్టు సిరీస్ తర్వాత నువ్వు మరింత గొప్పగా, ఇంకాస్త వినయంగా తిరిగొచ్చేవాడివి. నువ్వు ఎదిగిన తీరును పక్కనే ఉండి చూడటం నా అదృష్టంగా భావిస్తున్నా'' అని అనుష్క రాసుకొచ్చారు.